
Asia Cup 2025 : టీమిండియా బ్యాటర్లకు ఆ 11 మంది స్పిన్నర్లతోనే సమస్య.. వాళ్లు ఎవరంటే?
ఈ వార్తాకథనం ఏంటి
సెప్టెంబర్ 9 నుండి ప్రారంభమవనున్న ఆసియా కప్‌లో భారత జట్టు ఘనంగా పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కానీ, ఛాంపియన్‌గా మారడం అంత సులభం కాదు. భారత బ్యాట్స్‌మెన్‌లను కట్టడి చేయగలిగే మొత్తం 11 మంది స్పిన్నర్లు ఈ టోర్నమెంట్‌లో ఉన్నారు. అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎలాంటి స్టార్ ప్లేయర్ అయినా ఈ స్పిన్నర్ల నుంచి తప్పించుకోవడం కష్టమే అని చెప్పొచ్చు.
Details
భారత జట్టుకు ప్రధాన ముప్పులు
1. రషీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్) అతిపెద్ద ముప్పు అఫ్గానిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ నుండి ఉంది. గత కొన్ని నెలలుగా ఫామ్‌లో లేని రషీద్ ఇప్పుడు తిరిగి ఆటలోకి వచ్చాడు. టీ20 ట్రై సిరీస్‌లో 4 మ్యాచ్‌లలో 9 వికెట్లు తీశాడు. 2. నూర్ అహ్మద్ (అఫ్గానిస్తాన్) రషీద్ ఖాన్ శిష్యుడు నూర్ అహ్మద్, భారత జట్టుకు రెండో పెద్ద ముప్పు. వేగవంతమైన స్పిన్‌తో ప్రసిద్ధి పొందిన అతను 3 మ్యాచ్‌లలో 5 వికెట్లు తీశాడు. 3. మహమ్మద్ నవాజ్ (పాకిస్థాన్) మూడో ముప్పుగా పాకిస్థాన్ స్పిన్నర్ నవాజ్. ట్రై సిరీస్ ఫైనల్‌లో అఫ్గానిస్తాన్‌ను ఓడించి, 5 మ్యాచ్‌లలో 10 వికెట్లు తీశాడు, ఫైనల్‌లో 5 వికెట్లు పడగొట్టాడు.
Details
4. అబ్రార్ అహ్మద్ (పాకిస్థాన్)
నాల్గో ముప్పుగా అబ్రార్ అహ్మద్. 2 మ్యాచ్‌లలో 6 వికెట్లు తీశాడు. రెండు వైపులా బంతిని స్పిన్ చేయగలడు 5. సూఫియాన్ ముఖీమ్ (పాకిస్థాన్) లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్. మొదటిసారిగా భారత్‌తో ఆడనున్నారు. 4 మ్యాచ్‌లలో 4 వికెట్లు తీశా, కాబట్టి కప్‌లీక్ నైపుణ్యం ఉంది, కుల్‌దీప్ యాదవ్ స్థాయిలో బౌలింగ్ చేయగలడు 6. మహమ్మద్ నబీ (అఫ్గానిస్తాన్) అనుభవజ్ఞుడు నబీ గతంలో భారత జట్టుకు సమస్యలు సృష్టించాడు. 4 మ్యాచ్‌లలో 4 వికెట్లు తీశాడు. 7. హైదర్ అలీ (యూఏఈ) లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. 4 మ్యాచ్‌లలో 6 వికెట్లు తీశాడు. భారత్‌కి కొత్త ముప్పుగా చెప్పొచ్చు
Details
8. మహమ్మద్ అల్లాహ్ గజన్ఫర్ (అఫ్గానిస్తాన్)
మిస్టరీ స్పిన్నర్. రెండు టీ20 మ్యాచ్‌లలో ఆడినా, 11 వన్డేలలో రెండుసార్లు ఐదు వికెట్లు తీశాడు. శ్రీలంక నుండి ముగ్గురు డేంజర్లు ఈ ఎనిమిది మంది స్పిన్నర్లకు అదనంగా, శ్రీలంకకు చెందిన ముగ్గురు లెగ్ స్పిన్నర్లు వానిందు హసరంగా, వెల్లాలగే, మహీష్ తీక్షణ భారత బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెట్టగలరు.