
చివరి ఓవర్లలో పంజాబ్ బ్యాటర్ల విజృంభణ; కేకేఆర్ లక్ష్యం 180పరుగులు
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌లో సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్)- పంజాబ్ కింగ్స్(పీబీకేఎస్) మధ్య జరిగిన తొలి ఇన్నింగ్స్ హోరాహోరీగా సాగింది.
తొలుత పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
పంజాబ్ బ్యాటర్లు 20ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 179 పరుగులు చేశారు.
మొదటి నుంచి కట్టడిగా బౌలింగ్ చేసిన కేకేఆర్ బౌలర్లు చివరి ఓవర్లలో ధారాలంగా పరుగులు సమర్పించుకున్నారు.
20వ ఒక్క ఓవర్‌లోనే రెండో ఫోర్లు, రెండు సిక్సులను హర్షిత్ రాణా సమర్పించికున్నాడు. 19వ ఓవర్లో కూడా ముడు ఫోర్లను పంజాబ్ బ్యాటర్లు రాబట్టారు.
ఫలితంగా కేకేఆర్ ముందు 180పరుగుల గౌరవప్రదమైన లక్ష్యాన్ని పంజాబ్ ఉంచింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చివరి ఓవర్‌లో 21పరుగులు
Finished strong! 💪🏻
— Punjab Kings (@PunjabKingsIPL) May 8, 2023
Time to get the job done with the ball. 👊🏻#KKRvPBKS #JazbaHaiPunjabi #SaddaPunjab #TATAIPL pic.twitter.com/ncwY1YVZge