Page Loader
ఐపీఎల్‌లో నన్ రైజర్స్ హైదరాబాద్ సాధించిన రికార్డులివే
ఐపీఎల్ టైటిల్‌పై కన్నేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్

ఐపీఎల్‌లో నన్ రైజర్స్ హైదరాబాద్ సాధించిన రికార్డులివే

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 30, 2023
11:02 am

ఈ వార్తాకథనం ఏంటి

మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్ లీగ్ 16వ సీజన్ కోసం అంతా సిద్ధమైపోయింది. ఆడమ్ గిల్ క్రిస్ట్ కెప్టెన్‌గా.. దక్కన్ చార్జర్స్‌గా ఉన్న సమయంలో రెండో సీజన్ (2009)లోనే విజేతగా ఆవిర్భవించింది. ఇక 2012లో కాంట్రాక్టు నిబంధనల ఉల్లంఘనకు గాను ఆ జట్టుపై వేటు పడింది. 2013 నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్‌గా మారింది. 2013లో ఐపీఎల్ బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. 2016లో టైటిల్ సొంతం చేసుకుంది. గత రెండేళ్లుగా కనీసం ఫ్లేఆఫ్ కూడా క్వాలిఫై కాకుండా అభిమానులను నిరాశపరిచింది. గత సీజన్‌లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఆరు విజయాలు, ఎనిమిది ఓటములతో 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచి ప్లేఆఫ్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది.

సన్ రైజర్స్

టైటిల్ ఫెవరేట్‌గా బరిలోకి సన్ రైజర్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరువాత అత్యంత నిలకడైన జట్టుగా సన్ రైజర్స్ హైదరాబాద్ పేరు తెచ్చుకుంది. 2016 సీజన్ లో చాంపియన్ గా నిలిచిన హైదరాబాద్.. 2018లో రన్నరప్ గా నిలిచింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకూ ఐపీఎల్‌లో 152 మ్యాచ్‌ల‌ను ఆడింది. ఇందులో 74 విజయాలు, మరో 74 ఓటములు ఉన్నాయి. మిగతా నాలుగు మ్యాచ్‌లు టై అయ్యాయి. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది. గతంలో వార్నర్ కెప్టెన్సీలో ఉన్న సన్ రైజర్స్ హైదరబాద్‌ను గుర్తుకు తెచ్చేలా ప్రస్తుతం టీం కనిపిస్తుంది. అయితే ఐకాన్ ప్లేయర్స్ లేకపోయినా ఐపీఎల్ 2023 సీజన్‌లో టైటిల్ ఫేవరెట్‌గా సన్ రైజర్స్ బరిలోకి దిగుతోంది.