
Sai Sudarshan: రూ.8.5 కోట్ల బ్యాటర్ చెలరేగిపోతున్నాడు.. టీమిండియాకు రీ-ఎంట్రీ ప్లాన్!
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ టీమ్ గెలుపుల పరంపరతో దూసుకుపోతోంది.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ విజయాల్లో ఓ కీలక పాత్ర పోషిస్తున్న యువ ఓపెనర్ - సాయి సుదర్శన్. అతడి నిలకడైన బ్యాటింగ్ ప్రదర్శనతో జట్టు విజయాలకు బలాన్ని అందిస్తున్నాడు.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు అయిదు మ్యాచ్‌లు ఆడిన సాయి సుదర్శన్, 54.60 సగటుతో మొత్తం 273 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ 151గా ఉండడం విశేషం.
దీంతో ఈ ఐపీఎల్‌లో టాప్ స్కోరర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న నికోలస్ పూరన్ (287) ఉన్నాడు.
Details
12 మ్యాచుల్లో 527 పరుగులు
ఈ ఐపీఎల్ 2025లో సుదర్శన్ 3 అర్థశతకాలు నమోదు చేశాడు. అతడి పర్సనల్ స్కోర్లు 74, 63, 49, 5, 82. ఒక్క మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడిన పోరులో మాత్రమే అతను తక్కువ స్కోరు (5) చేసి పెవిలియన్‌కు చేరాడు.
మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించి, జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. గత ఐపీఎల్ 2024లో కూడా సాయిసుదర్శన్ తన ప్రతిభను చాటాడు.
12 మ్యాచ్‌లలో 527 పరుగులు నమోదు చేశాడు. ఒక శతకం, రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు.
ఈ చక్కని ప్రదర్శన కారణంగా గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ అతనిని రూ.8.5 కోట్ల భారీ మొత్తం చెల్లించి రిటైన్ చేసుకుంది.
Details
గాయాల కారణంగా జట్టులో స్థానం కోల్పోయిన సాయి సుదర్శన్
అంతేకాకుండా, సుదర్శన్ ఇప్పటికే భారత జట్టులో కూడా అవకాశాలు పొందాడు. టీ20లు, వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు ఆడిన మూడు వన్డేల్లో 63.50 సగటుతో 127 పరుగులు చేశాడు.
రెండు అర్థశతకాలు నమోదు చేశాడు. అయితే గాయాల కారణంగా తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు.
ప్రస్తుతం ఐపీఎల్ 2025లో తిరిగి తన ఫిట్‌నెస్, ఫామ్‌ని నిరూపించుకుంటూ, మళ్లీ టీమిండియా జెర్సీని ధరించాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నాడు.
అతని ప్రదర్శన చూస్తే, త్వరలోనే మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.