LOADING...
IND vs WI: అహ్మదాబాద్‌లో మూడో రోజు ప్రారంభం.. ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసిన భారత్!
అహ్మదాబాద్‌లో మూడో రోజు ప్రారంభం.. ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసిన భారత్!

IND vs WI: అహ్మదాబాద్‌లో మూడో రోజు ప్రారంభం.. ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసిన భారత్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 04, 2025
10:21 am

ఈ వార్తాకథనం ఏంటి

అహ్మదాబాద్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న టీమిండియా మొదటి టెస్ట్‌ మ్యాచ్‌లో మూడో రోజు ఆట ప్రారంభమైంది. నైట్‌ స్కోర్‌ 448/5 ఓవర్‌ వద్ద భారత జట్టు తన ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. ప్రస్తుతం టీమ్‌ఇండియా 286 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. రెండో రోజు ముగిసే సమయానికి రవీంద్ర జడేజా (104*; 176 బంతుల్లో, 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) వాషింగ్టన్ సుందర్ (9*; 13 బంతుల్లో) నాటౌట్‌గా నిలిచారు. రెండో రోజు ఆటలో మూడు సెంచరీలు సాధించడం భారత బ్యాటింగ్‌ కోసం విశేషం.

Details

సెంచరీతో ఆకట్టుకున్న రవీంద్ర జడేజా

కేఎల్‌ రాహుల్ (100; 190 బంతుల్లో, 12 ఫోర్లు), ధ్రువ్ జురేల్ (125; 210 బంతుల్లో, 15 ఫోర్లు, 3 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (104*; 176 బంతుల్లో, 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఇంగ్లాండ్‌ సిరీస్‌లో గాయపడిన రిషబ్ పంత్ జట్టుకు దూరమైన సమయంలో, జురేల్ అందిన అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. అయిదో వికెట్‌కు జడేజాతో కలసి 206 పరుగుల (331 బంతుల్లో) భాగస్వామ్యం నెలకొల్పి వెస్టిండీస్‌ బౌలర్లకు కఠిన పరీక్ష పెట్టాడు.

Details

మొదటి ఇన్నింగ్స్ లో  162 పరుగులకే అలౌట్

వెస్టిండీస్‌ బౌలర్లలో రోస్టన్‌ ఛేజ్‌ 2 వికెట్లు, జైడెన్ సీల్స్‌, జొమెల్ వారికన్‌, ఖేరీ పియెరీ ఒక్కొక్క వికెట్‌ సాధించారు. మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ విఫలమైన వెస్టిండీస్‌ 44.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. కరేబియన్‌ బ్యాటర్లలో జస్టిన్ గ్రీవ్స్ (32; 48 బంతుల్లో, 4 ఫోర్లు), షై హోప్ (26; 36 బంతుల్లో, 3 ఫోర్లు), రోస్టన్ ఛేజ్ (24; 43 బంతుల్లో, 4 ఫోర్లు) మాత్రమే ప్రస్తావనీయ స్కోర్లు సాధించారు. ప్రస్తుతం వెస్టిండీస్‌ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ను ప్రారంభించింది.