LOADING...
Sunil Gavaskar: యువ ఆటగాడి ఇన్నింగ్స్ ఆకట్టుకుంది : సునీల్ గావస్కర్
యువ ఆటగాడి ఇన్నింగ్స్ ఆకట్టుకుంది : సునీల్ గావస్కర్

Sunil Gavaskar: యువ ఆటగాడి ఇన్నింగ్స్ ఆకట్టుకుంది : సునీల్ గావస్కర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 19, 2026
09:45 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండౌర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత జట్టు 41 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ పరాజయంతో భారత జట్టు మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయింది. జట్టు ఓడిపోయినప్పటికీ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (124) శతకంతో ఆకట్టుకునే ఇన్నింగ్స్ ఆడి అభిమానులను అలరించాడు. అలాగే యువ ఆటగాడు హర్షిత్ రాణా అర్ధశతకంతో తన సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో హర్షిత్ రాణా చూపిన ధైర్యవంతమైన బ్యాటింగ్‌పై టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖ్యంగా షార్ట్ పిచ్ బంతులను అతడు ఎంతో సమర్థంగా ఎదుర్కొన్న తీరును గావస్కర్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు.

Details

కళ్లు చెదిరే సిక్స్ లు కొట్టాడు

హర్షిత్ రాణా చాలా చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. ఏమాత్రం కంగారుపడకుండా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అంచనాలు లేకుండా క్రీజులోకి వచ్చి పరుగులు రాబట్టాడు. షార్ట్ పిచ్ బంతులను చక్కగా ఎదుర్కొన్నాడు. కళ్లు చెదిరే సిక్స్‌లు కూడా కొట్టాడు. అది నన్నెంతో ఆకట్టుకుందని సునీల్ గావస్కర్ వ్యాఖ్యానించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఈ మూడో వన్డేలో హర్షిత్ రాణా బ్యాటుతో చెలరేగిపోయాడు. అతడు 43 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 52 పరుగులు సాధించాడు. అంతేకాదు, ఏడో వికెట్‌కు విరాట్ కోహ్లీతో కలిసి కేవలం 69 బంతుల్లో 99 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ భాగస్వామ్యంలో కోహ్లీ 26 బంతుల్లో 42 పరుగులు చేయగా, మిగతా పరుగులు రాణా ఖాతాలో చేరాయి.

Details

1-2 సిరీస్ తో ఓడిన ఇండియా

వీరిద్దరూ క్రీజులో ఉన్నంతవరకు టీమ్ ఇండియా విజయం సాధిస్తుందని అభిమానులు గట్టిగా ఆశించారు. అయితే వేగంగా పరుగులు సాధించే ప్రయత్నంలో హర్షిత్ రాణా దురదృష్టవశాత్తూ పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత అవసరమైన పరుగుల భారం పెరగడంతో విరాట్ కోహ్లీ కూడా వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో టీమ్ ఇండియా ఈ మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా 1-2 తేడాతో కోల్పోయింది. ఇదిలా ఉండగా, బుధవారం నుంచి న్యూజిలాండ్‌తో జరిగే ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ నాగ్‌పుర్ వేదికగా జరగనుంది.

Advertisement