Page Loader
Markram: తమ ప్ర‌ణాళికలు స‌రిగ్గా అమ‌లు కాలేదు.. టీ20 సిరీస్ ఓటమిపై మార్క్రమ్ కామెంట్స్ 
తమ ప్ర‌ణాళికలు స‌రిగ్గా అమ‌లు కాలేదు.. టీ20 సిరీస్ ఓటమిపై మార్క్రమ్ కామెంట్స్

Markram: తమ ప్ర‌ణాళికలు స‌రిగ్గా అమ‌లు కాలేదు.. టీ20 సిరీస్ ఓటమిపై మార్క్రమ్ కామెంట్స్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 16, 2024
12:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

భార‌త్ చేతిలో ద‌క్షిణాఫ్రికా జట్టు 3-1 తేడాతో సిరీస్‌ను ఓడిపోయింది జోహెన్నెస్‌బర్గ్ వేదికగా శుక్ర‌వారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో టీమిండియా భారీ విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్ అనంత‌రం ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్‌క్ర‌మ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిరీస్ ఓట‌మిపై స్పందించారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లలో విఫలం కావడం వల్లే ఓడిపోయామని చెప్పారు. ముఖ్యంగా నాలుగో టీ20 మ్యాచ్‌లో వైడ్‌ల రూపంలో 17 ప‌రుగులు స‌మ‌ర్పించ‌డం తాము ఎదుర్కొన్న ఓట‌మికి ముఖ్య కారణంగా చెప్పారు. తమ గెలిచేందుకు పూర్తి స్థాయి ప్ర‌య‌త్నం చేసినా, అన్ని విభాగాల్లోనూ విఫ‌ల‌మైన‌ట్లు ఎయిడెన్ చెప్పాడు. త‌మ ప్ర‌ణాళిక‌లు మైదానంలో అమ‌లుకాక‌పోవ‌డంతో ఈ ఓటమి ఎదురైందన్నారు. భార‌త జ‌ట్టు బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ఒత్తిడి తీసుకువ‌చ్చిందని మార్‌క్ర‌మ్ తెలిపారు.

Details

135 పరుగుల తేడాతో భారత్ విజయం

ఇక 2026 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు త‌మ జట్టు మెరుగుదల సాధిస్తుందని ధీమాను కూడా వ్య‌క్తం చేశారు. మార్కో జాన్సెన్‌, గెరాల్డ్ కొయెట్జీ ఆట సానుకూలంగా ఉంద‌ని పేర్కొన్నారు. మ్యాచ్ విషయానికొస్తే మొద‌ట బ్యాటింగ్ చేసిన భారత్ 283 ప‌రుగులు సాధించింది. తిల‌క్ వ‌ర్మ (120*; 47 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్స‌ర్లు), సంజూ శాంస‌న్ (109*; 56 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్స‌ర్లు) శ‌త‌కాల‌తో చెల‌రేగారు. అభిషేక్ శ‌ర్మ (36; 18 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) కూడా మంచి ప్ర‌దర్శ‌న ఇచ్చాడు. భారీ లక్ష్య ఛేద‌నలో ద‌క్షిణాఫ్రికా 148 ప‌రుగులకే కూప్పకూలడంతో భారత్ 135 ప‌రుగుల భారీ తేడాతో విజ‌యం సాధించింది.