ODI World Cup 2023: వరల్డ్ కప్ మ్యాచులకు ఈ-టికెట్ సౌకర్యం లేదు
భారత్‌లో జరగనున్న వరల్డ్ కప్ 2023 మ్యాచుల్లో టికెట్ల విషయంపై ఎప్పటి నుంచో సందిగ్ధత నెలకొంది. ఈ వ్యవహరంపై తాజాగా బీసీసీఐ సెక్రటరీ జైషా స్ఫష్టతను ఇచ్చారు. ఇప్పటికే చాలా మంది ఫ్యాన్స్ ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్నారు. షెడ్యూల్ లో మార్పులు ఉంటాయని జైషా ప్రకటించారు. తాజాగా వరల్డ్ కప్ మ్యాచులకు ఈ టికెట్లను అనుమతించమని ఆయన స్పష్టం చేశారు. అభిమానులు కచ్చితంగా టికెట్ ప్రింట్ తీసుకొని స్టేడియానికి రావాలని ఆదేశాలు జారీ చేశారు. అభిమానులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, ఎనిమిది టికెట్ ప్రింటింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
అక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్ కప్ మ్యాచులు
భారత్‌లో వరల్డ్ కప్ మ్యాచులు అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనున్నాయి. ఇక ఆరంభ మ్యాచులో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్టు తలపడనున్నాయి. టీమిండియా, పాకిస్థాన్ హైఓల్టేజ్ మ్యాచ్ అక్టోబర్ 15న జరగాల్సి ఉంది. అయితే దేవీ నవరాత్రుల కారణంగా అక్టోబర్ 14న మ్యాచును నిర్వహించాలని అహ్మదాబాద్ పోలీసులు ఇప్పటికే బీసీసీఐకి సూచించిన విషయం తెలిసిందే. 2011లో సొంత గడ్డపై వరల్డ్ కప్‌ని గెలుచుకున్న భారత్, ఈసారి ఏ విధంగా రాణిస్తుందో వేచి చూడాల్సిందే.