IND vs NZ: ఆ సిక్స్‌ల వెనుక పక్కా ప్లానింగ్ ఉంది.. అభిషేక్ శర్మపై మార్క్ చాప్‌మన్ ప్రశంసలు
ఈ వార్తాకథనం ఏంటి
న్యూజిలాండ్ క్రికెటర్ మార్క్ చాప్‌మన్ (Mark Chapman) భారత జట్టు (Team India) టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma)పై ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖ్యంగా అతడి సిక్స్ హిట్టింగ్ సామర్థ్యాన్ని కొనియాడిన చాప్‌మన్, ఆ షాట్ల వెనుక స్పష్టమైన ప్లానింగ్ ఉందని అభిప్రాయపడ్డాడు. 'నిజాయతీగా చెప్పాలంటే వారి బ్యాటింగ్ అమోఘంగా, పూర్తిగా విధ్వంసకరంగా ఉంది. ముఖ్యంగా అభిషేక్ శర్మ సిక్స్ హిట్టింగ్ సామర్థ్యం అద్భుతం. ఈ విషయంలో అతడి ప్లానింగ్ చాలా బాగుంది. ప్రస్తుతం అతడు అత్యుత్తమమైన క్రికెట్ ఆడుతున్నాడు. ఫామ్‌లో ఉన్న బ్యాటర్లను పరుగులు చేయకుండా అడ్డుకోవడం కొన్నిసార్లు చాలా కష్టంగా మారుతుంది. మేం కచ్చితంగా మెరుగుపడతామని ఆశిస్తున్నానని చాప్‌మన్ వ్యాఖ్యానించాడు.
Details
బౌలర్లపై చాప్‌మన్ ప్రశంసలు
భవిష్యత్ ప్రణాళికలపై కూడా చాప్‌మన్ మాట్లాడాడు. 'మేం పెద్ద స్కోర్లు సాధించడం గురించి ఆలోచించాలి. పిచ్‌లు బాగున్నాయి. అయితే భారత్‌లో కొన్ని సందర్భాల్లో బంతి బాగా తిరుగుతుంది. అందుకే ప్రతి పరిస్థితికీ సిద్ధంగా ఉండాలి. టీ20 వరల్డ్‌కప్ 2026 (ICC Men's T20 World Cup) సన్నాహకాల్లో భాగంగా ప్రపంచంలోని అత్యుత్తమ టీ20 జట్లలో ఒకటైన టీమ్ ఇండియాతో తలపడటం మాకు మంచి అనుభవం. వారి నుంచి మేం చాలా నేర్చుకుంటామని పేర్కొన్నాడు. భారత బౌలర్లపై కూడా చాప్‌మన్ ప్రశంసలు కురిపించాడు. 'పవర్‌ప్లేలోనే మేం రెండు వికెట్లు కోల్పోయాం. ఇది సమంజసం కాదు. అయితే ఆ క్రెడిట్ అంతా భారత బౌలర్లకే చెందుతుంది.
Details
పరుగులు చేయకుండా కట్టడి చేశారు
వారు నిజంగా చక్కగా బంతులేసి మమ్మల్ని పరుగులు చేయకుండా కట్టడి చేశారు. మేం బంతిని బౌండరీలకు తరలించలేకపోయంటూ వాపోయాడు. గువాహటి వేదికగా జరిగిన మూడో టీ20లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 153 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత జట్టు కేవలం 10 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. ఫలితంగా ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ అసాధారణంగా చెలరేగిపోయాడు.
Details
టీ20 సిరీస్ కైవసం
కేవలం 20 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సులతో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)తో కలిసి మూడో వికెట్‌కు 40 బంతుల్లోనే 102 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇప్పటికే టీమ్ ఇండియా 3-0 తేడాతో ఐదు టీ20ల సిరీస్‌ను కైవసం చేసుకుంది. నాలుగో టీ20 విశాఖపట్నం వేదికగా బుధవారం, చివరి టీ20 తిరువనంతపురంలో శనివారం జరగనుంది.