ఈ ఏడాది ఎంట్రీతో సత్తా చాటిన బౌలర్లు వీరే..
ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాడ్ తరుపున ఆరగ్రేటం చేసిన మ్యాటీ పాట్స్ అద్భుతంగా రాణించాడు. లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్ తో జరిగిన టెస్టులో విలియమ్సన్ వికెట్ తీసి సత్తా చాటాడు. 4/13 రాణించి టెస్టులో అకట్టుకున్నాడు. రెండో ఇన్నింగ్స్లో మరోసారి విలియన్స్ వికెట్ తీశాడు. దీంతో పాట్స్ మొత్తం ఏడు వికెట్లు తీసి ఇంగ్లాండ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇటీవల లెగ్ స్పిన్‌తో అకట్టుకున్న అబ్రార్ అహ్మద్ క్రికెట్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఈనెల ప్రారంభంలో ముల్తాన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తన తొలి టెస్టులో ఏడువికెట్లు తీసి రికార్డును క్రియేట్ చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లు అబ్రార్ దెబ్బకు కుప్పకూలారు. తన మ్యాజిక్ స్పిన్ ఇంగ్లాండ్ బ్యాట్‌మెన్స్‌ను హడలెత్తించాడు.
పాకిస్తాన్ బౌలర్‌గా అబ్రార్ రికార్డు
వాహబ్ రియాజ్ తర్వాత తన టెస్ట్ క్రికెట్‌లో మొదటి రోజు ఐదు వికెట్లు తీసిన రెండవ పాకిస్తాన్ బౌలర్‌గా అబ్రార్ నిలవడం గమనార్హం. 117/1 తో అద్భుతంగా ఆడుతున్న ఇంగ్లాండ్ ను అబ్రార్ తన బౌలింగ్ తో ఒక్కొక్కరిని పెవిలియన్ కి పంపించాడు. అనంతరం ఇంగ్లాండ్ 281 పరుగులకుఅల్ అవుట్ అయ్యింది. ఆఖరి టెస్టులో పాకిస్తాన్ ఓడిపోగా.. అబ్రార్ తన అద్భుతమైన బౌలింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. కేవలం మూడు టెస్టులు ఆడిన ప్రభాత్ జయసూర్య టెస్టులో మెరుగైన ప్రదర్శన చేశాడు. శ్రీలంకకు చెందిన ఎడమచేతి వాటమైన స్పిన్నర్ కేవలం 6 ఇన్నింగ్స్‌లలో 20.37 సగటుతో మొత్తం 29 వికెట్లు తీసుకున్నాడు. తన టెస్టు కెరియర్లో అద్భుతమైన గణాంకాలను నమోదు చేశాడు.