ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ స్కోర్స్ చేసిన జట్లు ఇవే..!
ఐపీఎల్ చరిత్రలో తక్కువ పరుగులకే ఆలౌటై కొన్ని జట్లు చెత్త రికార్డును మూట కట్టుకున్నాయి. రెండుసార్లు ఆర్సీబీ జట్టు మరో జట్టును 60 కంటే తక్కువ పరుగులకే ఆలౌట్ చేయడం గమనార్హం. ప్రస్తుతం ఐపీఎల్ చరిత్రలో తక్కువ స్కోర్ కే అలౌట్ అయిన జట్లు గురించి తెలుసుకుందాం. 2017లో కేకేఆర్ జట్టు, ఆర్సీబీని కేవలం 49 పరుగులకే ఆలౌట్ చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోరు కావడం గమానర్హం. 2009లో ఆర్సీబీ చేతిలో రాజస్థాన్ రాయల్స్ 58 పరుగులకే ఆలౌటైంది. ఇది 2వ అత్యల్ప స్కోరు కావడం విశేషం. 2023 లో రాజస్థాన్ ను మరోసారి ఆర్సీబీ 59 పరుగులకే కట్టడి చేసింది. ఈ మ్యాచ్ జైపూర్ వేదికగా జరిగింది.
59 పరుగులకే రాజస్థాన్ రాయల్స్ ఆలౌట్
2017లో ఢిల్లీ క్యాపిటల్స్ ను 66 పరుగులకే ముంబై ఇండియన్స్ ఆలౌట్ చేసింది. అదే విధంగా 2017లోనే మరోసారి ఢిల్లీ క్యాపిటల్స్ ను పంజాబ్ కింగ్స్ 67 పరుగులకే కట్టడి చేసింది. 2008లో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచులో కోల్ కతా నైట్ రైడర్స్ 67 పరుగులకే కుప్పకూలింది. ఇక ప్రస్తుత ఐపీఎల్ 60వ మ్యాచులో 59 పరుగులకే రాజస్థాన్ రాయల్స్ ను ఆర్సీబీ ఆలౌట్ చేసింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఏకంగా 112 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమితో రాజస్థాన్ ప్లే ఆఫ్స్ ఆశలు సంక్లిష్టం అయ్యాయి.