అరంగేట్రం టెస్టులో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా పేయర్లు వీరే!
ఇప్పటివరకూ టెస్టు క్రికెట్ లో ఎన్నో గుర్తిండిపోయే ఇన్నింగ్స్‌లు ఆడిన బ్యాట్‌మెన్స్ చాలామందే ఉంటారు. వారంతా మైదానంలో పరుగుల వర్షం కురిపించి, ఎన్నో రికార్డులను సాధించారు. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో పరుగుల సాధించాలంటే బ్యాటర్ కు చాలా ఓపిక ఉండాలి. ఇప్పటివరకూ అరంగేట్రం టెస్టు మ్యాచులోనే సెంచరీ చేసిన ఆటగాళ్లు చాలామందే ఉంటారు. ప్రస్తుతం టాప్ 3 బ్యాటర్ల గురించి తెలుసుకుందాం. భారత మాజీ ఆటటగాడు లాలా అమర్ నాథ్ ఈ జాబితాలో మూడోస్థానంలో నిలిచాడు. 1933 డిసెంబర్ 15న ఇంగ్లండ్ పై టెస్టులో అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచులో లాలా రెండు ఇన్నింగ్స్ లో కలిసి 156 పరుగులు చేశాడు. మొత్త 24 మ్యాచులు ఆడిన అతను 878 పరుగులు చేశాడు.
మొదటి స్థానంలో శిఖర్ ధావన్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ 2013న కోల్‌కతాలో వెస్టిండీస్ తో జరిగిన టెస్టులో అరంగ్రేటం చేశారు. మొదటి మ్యాచులోనే సెంచరీ చేసి చెలరేగిపోయాడు. తొలి ఇన్నింగ్స్ లో 177 పరుగులు సాధించాడు. ఇప్పటివరకూ 39 టెస్టులు ఆడి 2679 పరుగులు చేశాడు. టీమిండియా తరుపున అరంగ్రేటం టెస్టులో అత్యధిక పరుగులు చేసి శిఖర్ ధావన్ సంచలన రికార్డు సృష్టించాడు. ధావన్ 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచులో అరంగ్రేటం చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ధావన్ 187 పరుగులు సాధించి సత్తా చాటాడు. మొత్తం 34 టెస్టులు ఆడిన శిఖర్ ధావన్ 2315 పరుగులు చేశాడు.