డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం రెండు పిచ్‌లు సిద్ధం.. కారణం ఇదేనా!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ప్రారంభం కావడానికి మరికొన్ని గంటలు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ పిచ్ పై కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తుదిపోరు కోసం ఐసీసీ ఏకంగా రెండు పిచ్ లను రెడీ చేసింది. ఈ విషయం తెలియగానే అభిమానులు గందరగోళానికి గురయ్యారు.
వాస్తవానికి ఐసీసీ రెండు పిచ్ లు తయారు చేయడం వెనుక వేరే కోణం దాగి ఉంది. ప్రస్తుతం చమురు ధరల పెంపుపై ఇంగ్లాండ్ లో ఆందోళనలు కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో కొంతమంది నిరసనకారులు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ పిచ్‌ను ధ్వంసం చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
Details
ఓవల్ క్రికెట్ మైదానానికి భారీ భద్రత
ఫైనల్స్ కు ముప్పు ఉన్న కారణంగా ఓవల్ క్రికెట్ మైదానానికి భారీగా భద్రత ఏర్పాటు చేశారు. అదే విధంగా ఐసీసీ నిబంధన 6.4 లో మార్పులు చేసి ప్రత్యామ్నాయ పిచ్‌ను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
పిచ్ పై ఆందోళన కారులు దాడి చేస్తే.. అది ఆడటానికి పనికి వస్తుందో లేదో ఓ అంచనాకు వస్తారు. ఒకవేళ పిచ్ కండిషన్ బాగలేకపోతే ప్రత్యామ్నాయ పిచ్ ను పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు.
ముఖ్యంగా పిచ్ దెబ్బతిన్న సమయంలో ఇరు జట్ల కెప్టెన్లయిన రోహిత్, కమిన్స్ నిర్ణయం ఆధారంగా ఆటను కొనసాగించడమా..? లేదా రద్దు చేయడమా? అనేది నిర్ణయిస్తారు.
నేడు డబ్య్లూటీసీ ఫైనల్ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభ కానుంది.