ఐఏఎస్ సాధించిన ఏకైక భారత్ క్రికెటర్
భారత జట్టులో ఓ గ్రేట్ క్రికెటర్ ఉన్నాడు ఆతను ఆట, చదువు రెండింటిలోనూ విజయం సాధించాడు. దేశంలో అత్యంత కష్టతరమైన ఐఏఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. అనంతరం భారత జట్టులో చేరాడు. ఈ ఆటగాడి పేరు అమయ్ ఖురాసియా. మధ్యప్రదేశ్ కు చెందిన భారత్ మాజీ బ్యాట్స్ మెన్ అమయ్ కురాసియా 1972లో జన్మించాడు. జట్టులోకి రాకముందే UPSC పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం చేశాడు. ఖురాసియా ఆడిన మొదటి మ్యాచ్ లోనే అర్ధ సెంచరీతో అప్పట్లో రికార్డును క్రియేట్ చేశాడు.
17 సంవత్సరాల వయస్సులో అరంగేట్రం
ఖురాసియా 17 సంవత్సరాల వయస్సులో ఫస్ట్-క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేశాడు. 1999లో పెప్సీ కప్‌లో శ్రీలంకతో టీమ్ ఇండియా తరపున తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. తన అరంగేట్రం మ్యాచ్‌లో కేవలం 45 బంతుల్లో 57 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇతర మ్యాచ్‌లలో తన ఫామ్‌ను కొనసాగించడంలో విఫలమయ్యాడు. దీంతో కొన్ని సంవత్సరాల తరువాత అంతర్జాతీయ క్రికెట్ కు ముగింపు పలికాడు. భారత్ తరఫున 12 వన్డేలు ఆడి.. 149 పరుగులు చేశాడు. తన చివరి మ్యాచ్ ని 2001లో శ్రీలంకతో ఆడాడు. మధ్యప్రదేశ్ తరపున 119 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 7000 పైగా పరుగులు చేశాడు. అనంతరం 2007, ఏప్రిల్ 22న ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.