
WTC final: డబ్ల్యూటీసీ ఫైనల్ వరకు ఆసీస్ సాగించిన ప్రయాణిమిదే!
ఈ వార్తాకథనం ఏంటి
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2023-25 సైకిల్ ఫైనల్ జూన్ 11న (బుధవారం) లార్డ్స్ వేదికగా జరగనుంది. ఇందులో ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన ఆస్ట్రేలియా, ఫైనల్‌కు అర్హత సాధించేందుకు తన ప్రయాణాన్ని అద్భుత విజయాలతో మలిచింది. పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆ జట్టు యాషెస్ సిరీస్ నుంచి బోర్డర్-గావస్కర్ ట్రోఫీ వరకు అత్యుత్తమ ప్రదర్శనలతో మెప్పించింది. శ్రీలంకలో 14 ఏళ్ల తర్వాత సిరీస్ గెలుపొందిన ఆస్ట్రేలియా, బోర్డర్-గావస్కర్ ట్రోఫీని కూడా 2015 తర్వాత మొదటిసారి కైవసం చేసుకుంది.
Details
యాషెస్ సిరీస్ - డ్రా ఫలితం
2023లో ఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్ ఉత్కంఠ భరితంగా సాగింది. మొదటి రెండు టెస్టుల్లో విజయం సాధించిన ఆసీస్ తదుపరి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. చివరికి ఈ సిరీస్ డ్రాగా ముగిసింది. ఇందులో 23 వికెట్లు పడగొట్టిన మిచెల్ స్టార్క్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు.
Details
పాకిస్థాన్‌పై క్లీన్‌స్వీప్
స్వదేశంలో పాకిస్థాన్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా 3-0తో పరిపూర్ణ విజయం సాధించింది. తొలి టెస్టులో: 360 పరుగుల తేడాతో ఘన విజయం రెండో టెస్టులో: 79 పరుగుల తేడాతో విజయం మూడో టెస్టులో: 8 వికెట్ల తేడాతో గెలుపు వెస్టిండీస్‌తో సమంగా వెస్టిండీస్‌తో ఆస్ట్రేలియా రెండు టెస్టుల సిరీస్ ఆడింది. మొదటి టెస్టులో ఆసీస్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. రెండో టెస్టులో వెస్టిండీస్ విజయం సాధించడంతో సిరీస్ 1-1తో ముగిసింది.
Details
న్యూజిలాండ్‌పై వైట్‌వాష్
న్యూజిలాండ్‌లో పర్యటించిన ఆసీస్ జట్టు మొదటి టెస్టులో 172 పరుగుల తేడాతో రెండో టెస్టులో 3 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. భారత్‌పై బోర్డర్-గావస్కర్ విజయగాథ భారత్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ 3-1 తేడాతో గెలిచింది మొదటి టెస్టులో 295 పరుగుల తేడాతో రెండో టెస్టులో 10 వికెట్ల తేడాతో మూడో మ్యాచ్ డ్రా నాలుగో టెస్టులో 184 పరుగుల తేడాతో ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది
Details
శ్రీలంకలో మరో మైలురాయి
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ అనంతరం శ్రీలంక పర్యటనలో ఆస్ట్రేలియా 2-0 తేడాతో సిరీస్ గెలిచింది. 2011 తర్వాత శ్రీలంకలో తొలి సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. ఫైనల్‌కు సమాయత్తం ఈ విజయాలన్నీ ఆస్ట్రేలియాకు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించేందుకు బలంగా మారాయి. బుధవారం జరిగే ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. విజేత జట్టు WTC 2023-25 ఛాంపియన్‌గా నిలవనుంది. తర్వాత జూన్ 20 నుంచి ఇంగ్లండ్-భారత్ మధ్య ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌తో 2025-27 సైకిల్ ప్రారంభం కానుంది.