SRH IPL 2025 Preview: ఈసారి కప్పు ఆ జట్టుదే.. వారు బరిలోకి దిగితే ప్రత్యర్థుల గుండెల్లో గుబులే!
ఈ వార్తాకథనం ఏంటి
గత ఐపీఎల్ సీజన్‌లో ఫైనల్‌కు చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఈసారి కూడా అదే దూకుడును కొనసాగించేందుకు సిద్ధంగా ఉంది.
గత సీజన్‌లో అనేక ఐపీఎల్ రికార్డులను సృష్టించిన ఈ జట్టు, టీ20 క్రికెట్‌ను కొత్త రూపంలో చూపించింది. పాట్ కమ్మిన్స్ నాయకత్వంలో SRH ఈసారి కూడా అదే ఉత్సాహాన్ని ప్రదర్శించనుంది.
వేలంలో సిద్ధం చేసిన కొత్త జట్టును చూస్తే, తమ ఆటతీరును కొనసాగించడానికే SRH ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు స్పష్టమవుతోంది.
Details
గత సీజన్‌లో SRH ప్రదర్శన ఎలా ఉంది?
ఆరు సంవత్సరాల విరామం తర్వాత ఫైనల్‌కు చేరుకుంది. లీగ్ దశలో మొదటి ఏడు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో ఎస్ఆర్‌హెచ్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది.
చివరికి 17 పాయింట్లతో రాజస్థాన్ రాయల్స్ (RR)తో సమంగా నిలిచినా, మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా రెండో స్థానాన్ని దక్కించుకుంది.
క్వాలిఫైయర్ 1 - కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) చేతిలో ఓటమి
క్వాలిఫైయర్ 2 - రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి ఫైనల్‌కి దూసుకెళ్లింది
ఫైనల్ - మళ్ళీ KKR చేతిలో ఓటమిపాలైంది
Details
ఈసారి ఎస్ఆర్‌హెచ్‌లో మార్పులు ఏంటి?
ఎస్ఆర్‌హెచ్ దూకుడైన బ్యాటింగ్ స్టైల్‌ను కొనసాగిస్తూ 250+ స్కోర్లను మూడు సార్లు నమోదు చేసింది.
RCBపై 287/3 స్కోరు సాధించి ఐపీఎల్‌లో అత్యధిక స్కోర్ నమోదు చేసింది.
ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ లాంటి ఆటగాళ్లతో ఇప్పటికే బ్యాటింగ్ లైనప్ శక్తివంతంగా ఉంది.
ఇషాన్ కిషన్‌ను కొనుగోలు చేయడం ద్వారా ఎస్ఆర్‌హెచ్ మరింత దూకుడు పెంచే అవకాశముంది.
Details
బౌలింగ్ యూనిట్, కొత్త స్ట్రాటజీ
ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ స్వయంగా బౌలింగ్ దళానికి నాయకత్వం వహించనున్నారు.
భువనేశ్వర్ కుమార్ జట్టులో లేకపోవడంతో మహమ్మద్ షమీ ప్రధాన బౌలర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా లాంటి బౌలర్లు బలమైన లైనప్‌ను అందించనున్నారు.
అంతర్జాతీయ బౌలింగ్ ఆప్షన్లతో పాటు అభిషేక్ శర్మ, కమిందు మెండిస్ వంటి స్పిన్నర్లు తక్కువ ఓవర్లలో ప్రభావం చూపే అవకాశం ఉంది.
Details
ఐసీఎల్ 2025 కోసం SRH పూర్తి జట్టు ఇదే
పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి
మహమ్మద్ షమీ, హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్, రాహుల్ చాహర్
ఆడమ్ జంపా, అథర్వ తైడే, అభినవ్ మనోహర్, సిమర్జిత్ సింగ్
జీషాన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కట్, బిడెన్ కార్సే, కమిందు మెండిస్, అనికేత్ వర్మ, ఇషాన్ మలింగ, సచిన్ బేబీ.