SA vs IND: గెబేహాలో వర్షం ముప్పు.. రెండో టీ20 మ్యాచ్‌పై ప్రభావం
భారత జట్టు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌ను ఘనంగా ప్రారంభించింది. డర్బన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో గెలుపొందింది. ప్రస్తుతం రెండో టీ20 మ్యాచ్ కోసం సిద్ధమైంది. ఇక స్వదేశంలో ఘోర ఓటమిని ఎదుర్కొన్న సఫారీ జట్టు ప్రతీకారం తీర్చుకోవాలని గట్టి పట్టుదలగా ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ సూచిస్తోంది. రెండో టీ20 మ్యాచ్ గెబేహాలో జరగనుంది. మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. గెబేహాలో మాత్రం టైమ్ మధ్యాహ్నం 4 గంటల సమయం ఉంటుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందే వర్షం ఇబ్బంది పెడితే, టాస్ కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
వర్షం వల్ల ఆట కొనసాగకపోతే రద్దు చేసే అవకాశం
వర్షం కారణంగా మొదటి ఇన్నింగ్స్‌లో ఆటకు అంతరాయం ఏర్పడితే, గేమ్‌ను తిరిగి పునఃప్రారంభించడానికి సమయం క్రమంగా తగ్గిపోతుంది. ఒకటి లేదా రెండు గంటలు వర్షం ఆగినా, మైదానం సిద్ధం చేయడానికి మరింత సమయం పడుతుంది. ఆ సమయంలో వర్షం మళ్ళీ కురుస్తే, మ్యాచ్‌ను కొనసాగించడం కష్టమే. అయితే, వర్షం వల్ల పూర్తిగా మ్యాచ్ నిర్వహించలేకపోతే కనీసం 5 ఓవర్ల ఆటను నిర్వహిస్తారు. దాని తరువాత కూడా ఆట సాగకపోతే, మ్యాచ్ రద్దు చేస్తారు. ఇలాంటి తరుణంలో భారత్ 1-0 ఆధిక్యంలో ఉన్నందున, మిగిలిన రెండు మ్యాచుల్లో ఏదొకటి గెలిస్తే సిరీస్ భారత్‌కే సొంతమవుతుంది.
అభిషేక్ శర్మ ఆడతాడా?
టీమిండియా తొలి మ్యాచ్‌లో 200 పైగానే పరుగులు చేసినప్పటికీ, 250+ స్కోర్ సాధించడంలో విఫలమైంది. సూర్య, తిలక్, సంజు ఔటైన తరువాత బ్యాటర్లు కొంత ఇబ్బంది పడ్డారు. అభిషేక్ శర్మను ఓపెనర్‌గా ఆడించినప్పటికీ, అతడి ఆరంభం మెరుపుగా ఉండకపోవడంతో, రెండో టీ20లో అతనికి అవకాశం ఇవ్వాలని టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ అనుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. కొత్త కుర్రాళ్లు రమణ్‌దీప్, విజయ్‌కుమార్ వైశాక్‌కు తొలి టీ20లో అవకాశం ఇవ్వకపోయినా, సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లిన తరువాత వారికి అవకాశాలు ఇవ్వాలని మేనేజ్‌మెంట్ చూస్తున్నట్లు క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.