Loading...
Tilak Varma : తిలక్‌ వర్మ సెంచరీ వృథా.. పాకిస్థాన్‌ 'ఎ' చేతిలో భారత్‌ 'ఎ' ఓటమి
తిలక్‌ వర్మ సెంచరీ వృథా.. పాకిస్థాన్‌ 'ఎ' చేతిలో భారత్‌ 'ఎ' ఓటమి

Tilak Varma : తిలక్‌ వర్మ సెంచరీ వృథా.. పాకిస్థాన్‌ 'ఎ' చేతిలో భారత్‌ 'ఎ' ఓటమి

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 23, 2026
09:00 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ వన్డే టోర్నీలో భారత 'ఎ' జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్‌ తిలక్‌ వర్మ (148 బంతుల్లో 100; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అద్భుత సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. తొలి మ్యాచ్‌లో నేపాల్‌పై సునాయాస విజయం సాధించిన భారత్‌ 'ఎ'.. గ్రూప్‌ 'బి'లో భాగంగా ఆదివారం జరిగిన పోరులో పాకిస్థాన్‌ 'ఎ' చేతిలో 48 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

వివరాలు

పాకిస్థాన్‌ 'ఎ' భారీ స్కోరు

తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ 'ఎ' జట్టు 49.2 ఓవర్లలో 313 పరుగులకు ఆలౌటైంది.

ఆ జట్టు బ్యాటర్లలో హసన్‌ నవాజ్‌ (79; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), మాజ్‌ సదాఖత్‌ (59; 6 ఫోర్లు, 1 సిక్స్‌), ఫర్హాన్‌ యూసఫ్‌ (56; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలతో రాణించారు.

భారత బౌలర్లలో విప్రాజ్‌ నిగమ్, సూర్యాంశ్‌ షెడ్గే, ప్రిన్స్‌ యాదవ్, హర్షిత్‌ రాణా తలా రెండు వికెట్లు పడగొట్టారు.

వివరాలు

తిలక్‌ వర్మ సెంచరీ వృథా

314 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత 'ఎ' జట్టు 49.1 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. అభిషేక్‌ శర్మ (42 బంతుల్లో 70; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), షహబాజ్‌ అహ్మద్‌ (49 బంతుల్లో 56; 1 ఫోర్, 4 సిక్స్‌లు) అర్ధశతకాలతో పోరాడారు.

కెప్టెన్‌ తిలక్‌ వర్మ సెంచరీతో చివరి వరకు పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. పాకిస్థాన్‌ 'ఎ' బౌలర్లలో అలీ రజా, హసన్‌ నవాజ్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

తదుపరి మ్యాచ్‌లో భారత 'ఎ' జట్టు మంగళవారం యూఏఈతో తలపడనుంది.

ADVERTISEMENT