Page Loader
Tilak Varma: గౌతమ్ గంభీర్ రికార్డును బ్రేక్ చేసిన తిలక్ వర్మ 
గౌతమ్ గంభీర్ రికార్డును బ్రేక్ చేసిన తిలక్ వర్మ

Tilak Varma: గౌతమ్ గంభీర్ రికార్డును బ్రేక్ చేసిన తిలక్ వర్మ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 09, 2023
12:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు తేజం తిలక్ వర్మ అరంగేట్రం సిరీస్‌లోనే అదరగొడుతున్నారు. వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. వరుసగా మూడు టీ20ల్లో 39, 51, 49* పరుగులతో అకట్టుకుంటున్నాడు. మూడో టీ20ల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 49 పరుగులతో అజేయంగా నిలిచాడు. రెండో అర్ధ శతకం నమోదు చేసే అవకాశం తృటిలో మిస్ అయినా టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. తన అద్భుత ఇన్నింగ్స్ తో ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నారు. టీ20 ఫార్మాట్లో టీమిండియా తరుపున తొలి మూడు ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ను అధిగమించాడు.

Details

అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా తిలక్ వర్మ

ఈ జాబితాలో దీపక్ హుడా 172 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఈ క్రమంలో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్‌ 139 పరుగులతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. ఇక గౌతం గంభీర్ 109 పరుగులతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్ తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో తిలక్ వర్మ మూడు మ్యాచుల్లో కలిపి 139 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అదే విధంగా తొలి మూడు ఇన్నింగ్స్‌లో 30 పైగా పరుగులు చేసి, సూర్యకుమార్ యాదవ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్ గా తిలక్ వర్మ చరిత్రకెక్కాడు.