Tilak Varma: న్యూజిలాండ్‌తో చివరి రెండు టీ20లకు తిలక్ వర్మ ఔట్.. శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు కూడా భారత బ్యాటర్ తిలక్ వర్మ (Tilak Varma) అందుబాటులో ఉండడు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న తిలక్ ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఫిట్‌నెస్ సాధించేందుకు కఠినంగా శ్రమిస్తున్నాడు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో జరిగే చివరి రెండు టీ20 మ్యాచ్‌లకూ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) భారత జట్టులో కొనసాగుతాడని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. మొదటి మూడు టీ20లకు తిలక్ వర్మ రీప్లేస్‌మెంట్‌గా శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేసినప్పటికీ, ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లోనూ అతడికి తుది జట్టులో అవకాశం దక్కలేదు.
Details
నాలుగో టీ20 బుధవారం
పూర్తి మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించిన అనంతరం తిలక్ వర్మ టీ20 ప్రపంచకప్ సన్నాహకాల కోసం ఫిబ్రవరి 3న ముంబయిలో భారత జట్టుతో కలవనున్నాడు. అనంతరం ఫిబ్రవరి 4న డీ.వై. పాటిల్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగే వార్మప్ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. ఇక న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ విషయానికొస్తే, ఇప్పటికే జరిగిన మూడు మ్యాచ్‌ల్లో టీమ్ ఇండియా వరుస విజయాలు సాధించి 3-0తో సిరీస్‌ను ఖాయం చేసుకుంది. నాలుగో టీ20 మ్యాచ్ బుధవారం (జనవరి 28) విశాఖపట్నం వేదికగా జరగనుంది.