Page Loader
Lionel Messi : టైమ్​ 'అథ్లెట్‌ ఆఫ్‌ ది ఇయర్‌'గా లియోనల్‌ మెస్సీ
టైమ్​ 'అథ్లెట్‌ ఆఫ్‌ ది ఇయర్‌'గా లియోనల్‌ మెస్సీ

Lionel Messi : టైమ్​ 'అథ్లెట్‌ ఆఫ్‌ ది ఇయర్‌'గా లియోనల్‌ మెస్సీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 06, 2023
03:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

అర్జెంటీనా ఫుట్‌ బాల్ స్టార్ లియోనల్ మెస్సీ (Lionel Messi ) కి మరో అరుదైన గౌరవం దక్కింది. మెస్సీ ఈ ఏడాది మియామి క్లబ్‌లో చేరిన విషయం తెలిసిందే. మొత్తం 14 మ్యాచులాడి 11 గోల్స్ కొట్టి జట్టును తొలిసారిగా లీగ్ విజేతగా నిలిపాడు. గతంలో అసాధ్యం కాదని వాటిని మెస్సీ సుసాధ్యం చేసి చూపించాడని, అతడు ఇంటర్ మియామి జట్టుకు సంతకం చేసి అమెరికాను ఏకంగా సార్ దేశంగా మార్చేశాడని టైమ్ మ్యాగజైన్ తెలిపింది. దీంతో ఈ ఏడాది టైమ్ మ్యాగజైన్ 'అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ గా మెస్సీ ఎంపికయ్యాడు.

Details

రెండో స్థానంలో క్రిస్టియానో రొనాల్డ్

మెస్సీ రాకతో ఎంఎల్ఎస్ టోర్నీ వీక్షకుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, అదే విధంగా టికెట్ ధరలు, విక్రయాలు కూడా బాగా పెరిగాయని టైమ్స్ పేర్కొంది. ఇక టైమ్స్ నుంచి గతంలో ఈ అవార్డు అందుకున్న మైకెల్ ఫల్ప్స్ (స్విమ్మింగ్), సీమోన్ బైల్స్(జిమ్నాస్టిక్స్) వంటి వారి సరసన మెస్సీ చేరాడు. ఇటీవలే ఎనిమిదో సారి బాలన్ డి ఓర్ అవార్డును మెస్సీ దక్కించుకున్న విషయం తెలిసిందే. 2022-23 గానూ ఉత్తమ ప్రదర్శన ప్రదర్శించడంతో పాటు ఖతర్ వేదికగా జరిగిన ఫుట్ బాల్ ప్రపంచ కప్‌లో తన గెలిపించిన మెస్సీకే ఈ అవార్డు వరించింది. అత్యధిక బాలన్‌ డి ఓర్‌ అవార్డు పొందిన వారిలో క్రిస్టియానో రొనాల్డో(5) (Cristiano Ronaldo) రెండో స్థానంలో నిలిచాడు.