Hardik Pandya : ప్రపంచ్ కప్‌కు సమయం దగ్గరపడుతోంది.. హార్థిక్ పాండ్యా ఫామ్‌లోకి రావాలి : పార్థివ్ పటేల్
ఈ వార్తాకథనం ఏంటి
విండీస్ పర్యటనలో టీ20 కెప్టెన్ గా వ్యవహరించిన టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హర్థిక్ పాండ్యా వరుసగా విఫలం కావడంతో విమర్శలు వెలువెత్తున్నాయి.
అతని సారథ్యంలో విండీస్‌పై టీమిండియా టీ20 సిరీస్‌ను కోల్పోయింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా అతనిపై ట్రోల్ ఎక్కువయ్యాయి.
విండీస్‌తో జరిగిన మూడో వన్డేలో 82 పరుగులు చేసిన పాండ్యా, అదే జట్టుతో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో 77 పరుగులే చేశారు. ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్ దగ్గరపడుతుండటంతో అతడి ఫామ్ పై భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ ఆందోళన వ్యక్తం చేశాడు.
స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచ కప్ కంటే ముందు పాండ్యా ఫామ్ లోకి రావాలని పార్థివ్ సూచించాడు.
Details
హార్థిక్ పాండ్యాపై ఆకాశ్ చోప్రా విమర్శలు
ఐపీఎల్ కూడా పాండ్యా పరుగులు చేయలేదని, కొన్ని సిరీస్‌లో పేలవ ప్రదర్శనతో చెత్త రికార్డును మూట కట్టుకుంటున్నాడని, అతడు ఫామ్ లోకి వస్తే టీమిండియా పట్టిష్టంగా ఉంటుందని పార్థివ్ చెప్పుకొచ్చాడు.
పాండ్యా కొంత కాలంగా దూకుడుగా ఆడడం లేదని భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా విమర్శించారు.
గత పది టీ20ల్లో పాండ్యా కేవలం రెండు, మూడుసార్లే మాత్రమే పరుగులు చేశాడని, ముఖ్యంగా అతడు భారీ షాట్లకు ప్రయత్నించడం లేదని పేర్కొన్నారు.
స్ట్రైక్‌రేట్‌ని పాండ్యా మరింత మెరుగుపరుచుకోవాలని ఆకాశ్ చోప్రా వెల్లడించారు.