Page Loader
టెస్టు క్రికెట్లో రికార్డుకు చేరువలో టామ్ లాథమ్
టెస్టులో 80 పరుగులు చేస్తే మెరుగైన రికార్డును అందుకోనున్న టామ్ లాథమ్

టెస్టు క్రికెట్లో రికార్డుకు చేరువలో టామ్ లాథమ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 22, 2023
12:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

టెస్టు క్రికెట్లో న్యూజిలాండ్ బ్యాటర్ టామ్ లాథమ్ అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. టెస్టులో 5వేల పరుగులు పూర్తి చేయడానికి టామ్ లాథమ్ 80 పరుగుల దూరంలో ఉన్నాడు. 2014లో లాథమ్ టెస్టుల్లో భారత్‌పై అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి 71 మ్యాచ్‌ల్లో 4,920 పరుగులు చేశాడు. ఇందులో 13సెంచరీలు, 25 అర్ధ సెంచరీలున్నాయి. స్వదేశంలో ఆడిన టెస్టులో 2415 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు, తొమ్మిది అర్ధ సెంచరీలున్నాయి. రాస్ టేలర్ (7,683), కేన్ విలియమ్సన్ (7,651), స్టీఫెన్ ఫ్లెమింగ్ (7,172), బ్రెండన్ మెకల్లమ్ (6,453), మార్టిన్ క్రో (5,444), జాన్ రైట్ (5,334) పరుగులు చేసి లాథమ్ కంటే ముందు స్థానంలో ఉన్నారు.

టామ్ లాథమ్

టామ్ లాథమ్ సాధించిన రికార్డులివే

ఇంగ్లండ్‌తో జరిగిన 12 టెస్టుల్లో లాథమ్ 29.09 సగటుతో 611 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు అర్ధసెంచరీలు చేశారు. బే ఓవల్‌లో ఇటీవల ముగిసిన టెస్ట్ మ్యాచ్‌లో లాథమ్ వరుసగా 1, 15 పరుగులు మాత్రమే చేశాడు. డిసెంబర్ 2022లో కరాచీలో పాకిస్థాన్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో లాథమ్ తన 13వ టెస్టు సెంచరీని సాధించాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ 0-1తో వెనుకబడి ఉంది. బే ఓవల్‌లో జరిగిన తొలి టెస్టులో 267 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓడిపోయింది. రెండవ టెస్ట్ బేసిన్ రిజర్వ్‌లో ఫిబ్రవరి 24న జరగనుంది.