Aisa Cup 2023 : రేపు బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్.. భారత జట్టులో కొన్ని మార్పులు
ఆసియా కప్-4 లో భాగంగా ఇప్పటికే భారత జట్టు ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే ఆసియా కప్ నుంచి వైదొలిగిన బంగ్లాదేశ్ తో రేపు భారత జట్టు తలపడుతునుంది. ఈ మ్యాచులో ఇరు జట్లు కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నాయి. సెప్టెంబర్ 15న కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఈ రెండు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉండనుంది. మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. వన్డే ఫార్మాట్లో బంగ్లాదేశ్‌పై భారత జట్టు 31-7తో గెలుపు-ఓటముల రికార్డులను కలిగి ఉంది. గతేడాది బంగ్లాదేశ్, ఇండియాపై మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
బంగ్లా, భారత్ జట్టులోని ఆటగాళ్లు
ముష్ఫికర్ రహీమ్ ఈ మ్యాచుకు దూరమయ్యాడు. టీమిండియా తరుపున మహ్మద్ సిరాజ్‌కు విశ్రాంతినిచ్చి పేసర్ మహ్మద్ షమీకి అవకాశం ఇవ్వాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది. బంగ్లాదేశ్ జట్టు మహ్మద్ నైమ్, మెహిదీ హసన్ మిరాజ్, లిట్టన్ దాస్ (WK), షకీబ్ అల్ హసన్ (C), తౌహిద్ హృదయ్, అఫీఫ్ హొస్సేన్, షమీమ్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్, నసుమ్ అహ్మద్. భారత జట్టు రోహిత్ శర్మ (సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (డబ్ల్యుకె), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ.