ICC World Cup: రేపు అరుణ్ జైట్లీ స్టేడియంలో దక్షిణాఫ్రికా వర్సెస్ శ్రీలంక.. గెలుపు కోసం ఇరు జట్లు ఆరాటం
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా రేపు దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లు ఈ టోర్నీని గెలుపుతో ప్రారంభించాలని అశిస్తున్నాయి. ఇరు జట్లు ఇప్పటివరకూ 80 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో దక్షిణాఫ్రికా జట్టు 44 మ్యాచుల్లో గెలుపొందగా, శ్రీలంక 33 మ్యాచుల్లో నెగ్గింది. శ్రీలంక జట్టుపై క్వింటన్ డి కాక్ కు మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటివరకూ లంకపై 24 మ్యాచ్‌లు ఆడి 48.65 సగటుతో 1,119 పరుగులను సాధించాడు. సౌతాఫ్రికా తరుపున హషీమ్ ఆమ్లా (1,143), మార్వన్ అటపట్టు (1,164) తర్వాత అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా డికాక్ నిలిచాడు.
అద్భుత ఫామ్ లో డేవిడ్ మిల్లర్
డేవిడ్ మిల్లర్ కొంతకాలంగా మంచి ఫామ్‌లో ఉన్నాడు. మిల్లర్ శ్రీలంకపై 500 పరుగుల మైలురాయిని పూర్తి చేయడానికి కేవలం 23 పరుగుల దూరంలో ఉన్నాడు. సౌతాఫ్రికా పేసర్ కగిసో రబడ తన బౌలింగ్‌తో ప్రత్యర్థులకు వణుకు పుట్టించగలడు. శ్రీలంకపై 27 వికెట్లను తీసి సత్తా చాటాడు. ఓవరాల్‌గా వన్డేల్లో 144 వికెట్లను పడగొట్టిన అనుభవం అతనికి ఉంది. రబడ తొమ్మిది ప్రపంచ కప్ మ్యాచ్‌లలో 11 వికెట్లను తీశాడు. సౌతాఫ్రికా పేసర్ కగిసో రబడ తన బౌలింగ్‌తో ప్రత్యర్థులకు వణుకు పుట్టించగలడు. శ్రీలంకపై 27 వికెట్లను తీసి సత్తా చాటాడు. ఓవరాల్‌గా వన్డేల్లో 144 వికెట్లను పడగొట్టిన అనుభవం అతనికి ఉంది. రబడ తొమ్మిది ప్రపంచ కప్ మ్యాచ్‌లలో 11 వికెట్లను తీశాడు.
శ్రీలంక తరుఫున టాప్ స్కోరర్ గా నిలిచిన కుసాల్ మెండిస్
శ్రీలంక తరుఫున కుసాల్ మెండిస్ వన్డేల్లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతను 32.15 సగటుతో 3,215 పరుగులు చేశాడు. సౌతాఫ్రికాపై 17 మ్యాచ్‌లు ఆడి 25.76 సగటుతో 438 పరుగులను చేశాడు. ఈ ఏడాది 22 మ్యాచ్‌లు ఆడిన మెండిస్ 33.27 సగటుతో 599 రన్స్ చేశాడు. ఇక వన్డేల్లో పాతుమ్ నిస్సాంక 37.72 సగటుతో 1,396 పరుగులు చేశాడు.