LOADING...
T20 World Cup 2026: అత్యధిక క్యాచ్‌లు పట్టిన టాప్ 5 ప్లేయర్లు వీరే..
అత్యధిక క్యాచ్‌లు పట్టిన టాప్ 5 ప్లేయర్లు వీరే..

T20 World Cup 2026: అత్యధిక క్యాచ్‌లు పట్టిన టాప్ 5 ప్లేయర్లు వీరే..

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 28, 2026
09:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఫీల్డింగ్‌కు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. అత్యధిక క్యాచ్‌లు పట్టిన టాప్ 5 ఫీల్డర్ల జాబితాలో టీమిండియా ప్లేయర్ కూడా ఉన్నారు డేవిడ్ వార్నర్ నుంచి రోహిత్ శర్మ వరకూ, మైదానంలో గాల్లోకి ఎగిరి మరీ అసాధారణ క్యాచ్‌లతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన స్టార్ ఫీల్డర్ల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. క్రికెట్‌లో ఒక సామెత ఉంది.. క్యాచెస్ విన్ మ్యాచెస్ అని.. ఆ మాట ఎందుకు వచ్చిందో టీ20 ఫార్మాట్ చూస్తే అర్థమవుతుంది. ఈ ఫార్మాట్‌లో ఒక్క క్యాచ్ మ్యాచ్ దిశనే తిప్పేస్తుంది.బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఎన్నో అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసాలు అభిమానులను ఉర్రూతలూగించాయి.

వివరాలు 

టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన టాప్ 5 ఫీల్డర్ల గణాంకాలు

బౌండరీ లైన్ వద్ద గాల్లోకి ఎగిరి బంతిని అందుకోవడం నుంచి, 30 యార్డుల సర్కిల్‌లో మెరుపు వేగంతో స్పందించడం వరకూ ఫీల్డర్లు తమ జట్ల విజయాల్లో ప్రధాన భూమిక పోషించారు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన టాప్ 5 ఫీల్డర్ల గణాంకాలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. వారు ఆడిన మ్యాచ్‌లు, పట్టిన క్యాచ్‌లు, ఒక్కో ఇన్నింగ్స్‌కు క్యాచ్‌ల నిష్పత్తి ఇవన్నీ వారి నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తాయి. మరి ఆ టాప్ 5 అథ్లెటిక్ ఫీల్డర్లు ఎవరో చూద్దాం.

#1

డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)

ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ తనదైన ముద్ర వేశారు. మైదానంలో ఎప్పుడూ చురుగ్గా కదిలే వార్నర్, ఆస్ట్రేలియా ఫీల్డింగ్ విభాగానికి బలమైన స్థంభంగా నిలిచారు. టీ20 ప్రపంచకప్‌లో ఆయన మొత్తం 41 మ్యాచ్‌లు ఆడారు. ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా వార్నర్ అగ్రస్థానంలో ఉన్నారు. తన టీ20 ప్రపంచకప్ ప్రయాణంలో వార్నర్ మొత్తం 25 క్యాచ్‌లు అందుకున్నారు. ఒక్కో ఇన్నింగ్స్‌కు అతని క్యాచ్ రేషియో 0.609గా ఉంది. వేగవంతమైన కదలికలు, షార్ప్ రిఫ్లెక్స్‌లతో కష్టమైన క్యాచ్‌లను కూడా సులువుగా మార్చడం వార్నర్ ప్రత్యేకత. సగం అవకాశాలనూ వికెట్లుగా మలిచే అతని సేఫ్ హ్యాండ్స్ ఆస్ట్రేలియాకు ఎన్నో కీలక బ్రేక్‌లు ఇచ్చాయి.

Advertisement

#2

ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా)

'మిస్టర్ 360'గా పేరొందిన దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఫీల్డింగ్‌లోనూ తన క్లాస్ చూపించారు. మైదానంలో ఎక్కడ ఉన్నా బంతిని అడ్డుకోవడంలో ఆయనకు ప్రత్యేకమైన శైలి ఉంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో డివిలియర్స్ మొత్తం 30 మ్యాచ్‌ల్లో పాల్గొన్నారు. మ్యాచ్‌లు తక్కువే అయినా, క్యాచ్‌ల పరంగా ఆయన రికార్డు అసాధారణం. ఈ మెగా టోర్నీలో డివిలియర్స్ 23 క్యాచ్‌లు పట్టుకున్నారు. ముఖ్యంగా ఈ జాబితాలో అత్యధిక క్యాచ్-పర్-ఇన్నింగ్స్ రేషియో (0.92) ఆయనకే చెందడం విశేషం. బౌండరీ దగ్గర అయినా, సర్కిల్ లోపలైనా, డివిలియర్స్ అథ్లెటిసిజం, బంతి దిశను ముందే అంచనా వేసే సామర్థ్యం అతన్ని టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత నమ్మకమైన ఫీల్డర్లలో ఒకడిగా నిలబెట్టింది.

Advertisement

#3

గ్లెన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా)

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ తన అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఎన్నోసార్లు మ్యాచ్‌ల గమనాన్ని మార్చారు. టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఆయన 31 మ్యాచ్‌లు ఆడారు. ఈ టోర్నీలో మాక్స్‌వెల్ కూడా 23 క్యాచ్‌లు తన ఖాతాలో వేసుకున్నారు. ఒక్కో ఇన్నింగ్స్‌కు అతని క్యాచ్ రేషియో 0.741గా నమోదైంది. మైదానంలో మెరుపు డైవ్‌లు, వేగవంతమైన కదలికలతో మాక్స్‌వెల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. అసాధ్యం అనిపించిన క్యాచ్‌లను కూడా ధైర్యంగా డైవ్ చేస్తూ పట్టుకోవడం ఆయనకు అలవాటు. ప్రత్యర్థి బ్యాటర్లను కీలక సమయంలో పెవిలియన్‌కు పంపడంలో మాక్స్‌వెల్ ఫీల్డింగ్ ఆస్ట్రేలియాకు ఎంతో ఉపయోగపడింది. ఈ స్థిరమైన ప్రదర్శనతోనే ఆయన టాప్ 5 జాబితాలో నిలిచారు.

#4

రోహిత్ శర్మ (భారత్)

ఈ జాబితాలో నాలుగో స్థానంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉండటం చాలా మందికి ఆశ్చర్యం కలిగించవచ్చు. సాధారణంగా రోహిత్ బ్యాటింగ్ ఘనతల గురించే ఎక్కువగా మాట్లాడుతారు. అయితే ఫీల్డర్‌గా కూడా హిట్‌మ్యాన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో రోహిత్ శర్మ మొత్తం 47 మ్యాచ్‌లు ఆడారు. ఈ టోర్నీలో రోహిత్ 21 క్యాచ్‌లు అందుకున్నారు. అతని క్యాచ్-పర్-ఇన్నింగ్స్ రేషియో 0.446గా ఉంది. ఒత్తిడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఫీల్డింగ్ చేస్తూ కూడా చాలా కూల్‌గా క్యాచ్‌లు పట్టడం రోహిత్ ప్రత్యేకత. భారత్ ఫీల్డింగ్ విభాగంలో రోహిత్ సేఫ్ హ్యాండ్స్ జట్టుకు కీలక బలంగా నిలిచాయి.

#5

మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్)

న్యూజిలాండ్ మాజీ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ మైదానంలో చిరుతలా కదులుతాడు. కివీస్ జట్టులో అత్యంత నమ్మకమైన ఫీల్డర్లలో ఆయన ఒకరు. టీ20 ప్రపంచకప్‌లో గప్టిల్ మొత్తం 28 మ్యాచ్‌లు ఆడారు. ఈ మ్యాచ్‌ల్లో ఆయన 19 క్యాచ్‌లు పట్టుకున్నారు. ఒక్కో ఇన్నింగ్స్‌కు అతని క్యాచ్ రేషియో 0.678గా ఉంది. ముఖ్యంగా డీప్ ఫీల్డింగ్‌లో గప్టిల్ చూపించే ప్రశాంతత అద్భుతం. గాల్లోకి ఎగసే బంతిని అంచనా వేయడంలో అతని జడ్జిమెంట్ చాలా కచ్చితంగా ఉంటుంది. కష్టమైన క్యాచ్‌లను కూడా సులువుగా అందుకుంటూ, న్యూజిలాండ్‌కు ఒక అద్భుతమైన ఫీల్డర్‌గా గప్టిల్ పేరు తెచ్చుకున్నారు.

Advertisement