AUS vs IND: వరుసగా ట్రావిడ్ హెడ్ రెండో సెంచరీ.. ఆసీస్ స్కోరు 234/3
భారత్‌తో జరుగుతున్న గబ్బా టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్లు దూకుడుగా అడుతున్నారు. రెండో రోజు టీ బ్రేక్ సమయానికి ఆసీస్ 3 వికెట్ల నష్టానికి 234 పరుగులు సాధించింది. ట్రావిస్ హెడ్ వరుసగా రెండో శతకం సాధించి ఆకట్టుకున్నాడు. కేవలం 115 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేశాడు. అదే విధంగా స్టీవ్ స్మిత్ కూడా అర్ధశతకం నమోదు చేసి మంచి ప్రదర్శన కనబరిచాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 159 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం విశేషం. రెండో సెషన్‌లో ఆసీస్ వికెట్ నష్టపోకుండా 130 పరుగులు రాబట్టింది. భారత్ బౌలర్లలో జస్ప్రిత్ బుమ్రా రెండు, నితీశ్ కుమార్ రెడ్డి ఒక వికెట్ తీశారు.