Page Loader
Ira Jadhav: అండర్-19 క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన ఇరా జాదవ్
అండర్-19 క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన ఇరా జాదవ్

Ira Jadhav: అండర్-19 క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన ఇరా జాదవ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 12, 2025
04:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ట్రిపుల్‌ శతకం సాధించిన దాఖలాలు లేవు. కానీ భారత యువ మహిళా క్రికెటర్ ఇరా జాదవ్ ఈ ఘనత సాధించి చరిత్ర సృష్టించింది. ఆమె అద్భుతమైన ఇన్నింగ్స్ తన జట్టుకు భారీ విజయం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది. భారత యువ మహిళా క్రికెటర్ ఇరా జాదవ్ అండర్-19 స్థాయిలో విశేష కృషి చేసింది. 14 ఏళ్ల ఇరా, మేఘాలయతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ముంబయి తరుపున 157 బంతుల్లోనే 346 పరుగులు చేసింది. ఆమె ఇన్నింగ్స్‌లో 42 ఫోర్లు, 16 సిక్సర్లు ఉన్నాయి.

Details

మహిళా క్రికెట్‌లో తొలి ట్రిపుల్‌ సెంచరీ

ఈ ఘనతతో ఇరా భారత మహిళా క్రికెట్‌లో తొలి ట్రిపుల్‌ సెంచరీ సాధించిన క్రికెటర్‌గా నిలిచింది. ముంబయి జట్టు తొలుత బ్యాటింగ్‌ చేస్తూ 50 ఓవర్లలో కేవలం మూడు వికెట్ల నష్టానికి 563 పరుగులు సాధించింది. ఇది వన్డే మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి సాధించే స్కోరును ముంబయి ఒంటరిగా అధిగమించింది. కెప్టెన్ హుర్లే గాలా 116 పరుగులు చేయగా, ఇరా జాదవ్‌తో కలిసి రెండో వికెట్‌కు 274 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. తర్వాత దీక్ష పవార్‌తో 186 పరుగులు జోడించి, చివర్లో మితాలీ హర్షద్‌తో 33 బంతుల్లో 64 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించింది.

Details

 19 పరుగులకే ఆలౌట్

భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మేఘాలయ జట్టు కేవలం 19 పరుగులకే ఆలౌటైంది. కనీసం ఎదుర్కోలేక ముంబయి బౌలర్ల ముందు చేతులెత్తేసింది. జీయా, యయాతి తలో మూడు వికెట్లు తీయగా, రితికా, అక్షయ తలో రెండు వికెట్లు సాధించారు. మేఘాలయ ఇన్నింగ్స్‌లో ఎవ్వరూ రెండంకెల స్కోరును కూడా అందుకోలేదు. అదనంగా వచ్చిన 10 పరుగులే టాప్‌ స్కోరుగా నిలిచింది. తాజాగా జరిగిన డబ్ల్యూపీఎల్‌ వేలంలో ఇరా జాదవ్‌ను ఎవరూ కొనుగోలు చేయకపోయినా, ఈ ప్రదర్శనతో ఆమె తన ప్రతిభను నిరూపించింది. ఈ అద్భుత ఇన్నింగ్స్ ఆమె భవిష్యత్తుకు మరింత వెలుగులు నింపనుంది.