LOADING...
U-19 Womens T20 World Cup: గొంగడి త్రిష మెరుపులతో అండర్-19 మహిళల ప్రపంచకప్ భారత్ సొంతం!

U-19 Womens T20 World Cup: గొంగడి త్రిష మెరుపులతో అండర్-19 మహిళల ప్రపంచకప్ భారత్ సొంతం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 02, 2025
02:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

అండర్-19 మహిళల ప్రపంచకప్ విజేతగా భారత్ నిలిచింది. వరుసగా రెండోసారి అండర్-19 ప్రపంచకప్‌ను భారత జట్టు గెలుచుకుంది. కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఫైనల్లో 9 వికెట్ల తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది. 83 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 11.2 ఓవర్లలోనే చేధించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరిచింది. 2025 అండర్-19 టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగింది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుని 82 పరుగులకే ఆలౌటైంది. అండర్-19 ప్రపంచకప్‌ను సాధించాలని ఆశపడ్డ దక్షిణాఫ్రికా జట్టుకు నిరాశే ఎదురైంది.

Details

మూడు వికెట్లు తీసిన త్రిష

సౌతాఫ్రికా బ్యాటింగ్‌లో వాన్ వూరస్ట్ (23) అత్యధిక స్కోరు చేయగా, జెమా బోథా (16), ఫే కోవిలింగ్ (15) నిరాశపరిచారు. మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. తెలుగమ్మాయి గొంగడి త్రిష అసాధారణ ప్రదర్శన చూపింది. 32 బంతుల్లో 44 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన త్రిష, బౌలింగ్‌లోనూ మూడు కీలక వికెట్లు తీసి మ్యాచ్‌లో కీలక భూమిక పోషించింది. భారత్ బౌలర్లలో వైష్ణవి శర్మ, అయూష్ శుక్లా, పరునికా సిసోడియా తలా రెండు వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను కష్టాల్లో నెట్టారు. అనంతరం 83 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 11.2 ఓవర్లలో ఛేదించింది. త్రిషతో పాటు సానికా చాల్కే (26*) కూడా మెరుగైన ఆటతీరును ప్రదర్శించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సునాయాసంగా గెలిచిన భారత్