Vizag IPL Matches: విశాఖలో రెండు ఐపీఎల్ మ్యాచ్‌లు.. మ్యాచ్‌ల తేదీలు, టికెట్ల వివరాలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖ వేదికగా రెండు ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించనుండటంతో క్రీడాభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.
ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఆఫ్‌లైన్ విక్రయాలతో పాటు, ఆన్‌లైన్ ద్వారా కూడా టికెట్ల అమ్మకాన్ని త్వరలోనే ప్రారంభించనున్నారు.
ఈ విషయంపై నిర్వాహకులు త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారు. ఏసీఏ-వీడీసీఏ స్టేడియం సామర్థ్యం 25,000 మంది కావడంతో, అన్ని జాగ్రత్తలు తీసుకొని టికెట్ల విక్రయాలు నిర్వహించనున్నారు.
ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రం నలుమూలల నుండి క్రికెట్ అభిమానులు విశాఖ చేరుకోనున్నారు.
డే అండ్ నైట్ పద్ధతిలో మ్యాచ్‌లు నిర్వహించనుండడంతో, మ్యాచ్‌ల షెడ్యూల్‌పై ఏసీఏ ప్రతినిధులు త్వరలో స్పష్టత ఇవ్వనున్నారు.
Details
మార్చి 24న తొలి మ్యాచ్
సుదీర్ఘ విరామం అనంతరం ఐపీఎల్ మ్యాచులు విశాఖలో నిర్వహించేందుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) సన్నాహాలు పూర్తి చేసింది.
కొంతకాలంగా వన్డేలు, టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే నిర్వహించినప్పటికీ, ఐపీఎల్ మ్యాచ్‌లు జరగలేదు. ఈసారి మార్చి చివరి వారంలో ఉత్తరాంధ్ర అభిమానులకు క్రికెట్ విందు అందించనున్నారు.
మార్చి 24న తొలి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరగనుంది. ఇక మార్చి 30న ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య రెండో మ్యాచ్ జరుగనుంది.
Details
విశాఖలో క్రికెట్ హంగామా
ఏసీఏ-వీడీసీఏ స్టేడియం గతంలో అనేక అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చింది.
విశాఖపట్నం సాగరతీరంలో ఉన్న ఈ మైదానం క్రీడాకారులు, ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది.
మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు, పోలీసు శాఖ సమగ్ర ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.
ఐపీఎల్ టికెట్ల అమ్మకాలపై మరింత సమాచారం త్వరలో వెల్లడికానుంది.