12 ఏళ్ల తరువాత టెస్టులోకి జయదేవ్ ఉనద్కత్ రీ ఎంట్రీ
భారత పేసర్ జయదేవ్ ఉనద్కత్ 12 ఏళ్ల తర్వాత టెస్టు క్రికెట్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. బంగ్లాదేశ్ లో జరిగే రెండో టెస్టులో చోటు సంపాదించుకున్నాడు. రెండు టెస్టుల మధ్య భారత క్రికెటర్‌గా అత్యధిక గ్యాప్‌ను నమోదు చేసిన ఘనత జయదేవ్ ఉనద్కత్‌కు దక్కింది. జయదేవ్ఉనద్కత్ తన తొలి, రెండో మ్యాచ్‌ల మధ్య 118 టెస్టులకు దూరమయ్యాడు. రెండు మ్యాచ్‌ల మధ్య 100 లేదా అంతకంటే ఎక్కువ టెస్టులను కోల్పోయిన భారతీయ ఆరోవ అటగాడిగా నిలిచాడు వికెట్ కీపర్-బ్యాటర్ దినేష్ కార్తీక్ 87 టెస్టులకు దూరమయ్యాడు. జయదేవ్ఉనద్కత్ 2010-11లో భారత్- దక్షిణాఫ్రికా పర్యటనలో తన తొలి టెస్టు ఆడాడు. కోచ్‌గా ఉన్న ద్రవిడ్ అప్పట్లో మూడో నెంబర్ బ్యాట్ మెన్‌గా బరిలోకి దిగారు.
సెంచూరియన్‌లో జయదేవ్ ఉనద్కత్ టెస్టు అరంగేట్రం మరచిపోలేనిది
అప్పట్లో విరాట్ కోహ్లీ తన టెస్టు కెరీర్‌ను ఇంకా ప్రారంభించలేదు. కోహ్లీ భారత్ జట్టులో 2010, డిసెంబర్ 16న వన్డేలో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఆ సమయంలో మహేంద్ర సింగ్ ధోనీ అన్ని ఫార్మాట్లలో ఇండియాకు నాయకత్వం వహించాడు. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జూన్ 2010లో టీమిండియాలో అవకాశం లభించింది. అనంతరం 2011లో అశ్విన్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఆ సమయంలో సచిన్ కెరీర్ చివరి దశలో ఉన్నాడు. సెంచూరియన్‌లో జయదేవ్ ఉనద్కత్ టెస్టు అరంగేట్రం మరచిపోలేనిది. భారత ఏకైక ఇన్నింగ్స్‌లో అతను 26 ఓవర్లలో 101 పరుగులు ఇచ్చాడు. 2022 ఢాకా టెస్టు మాదిరిగానే, సెంచూరియన్‌లో జయదేవ్ ఉనద్కత్ ఫస్ట్-చేంజ్ బౌలర్‌గా వచ్చాడు.