Page Loader
Tom Moody: అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌ నిబంధన ఐపీఎల్‌ టోర్నమెంట్‌కు చాలా కీలకం.. టామ్‌ మూడీ
అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌ నిబంధన ఐపీఎల్‌ టోర్నమెంట్‌కు చాలా కీలకం.. టామ్‌ మూడీ

Tom Moody: అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌ నిబంధన ఐపీఎల్‌ టోర్నమెంట్‌కు చాలా కీలకం.. టామ్‌ మూడీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 07, 2024
04:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కోచ్ టామ్ మూడీ ఇటీవల బీసీసీఐ తీసుకొచ్చిన అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ల కొత్త నిబంధన గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ ఈ కొత్త నిబంధన టోర్నమెంట్‌కు సానుకూల ప్రభావం చూపిస్తుందని, ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు ఇదొక మంచి మార్గమని అభిప్రాయపడ్డారు. ఈ నిబంధన సత్తా ఉన్న ఆటగాళ్లకు పెద్ద వేదికగా మారుతుందని, వారు ఐపీఎల్‌లో లేదా ఇతర ప్రధాన లీగ్‌లలో నిలకడగా ఆడటానికి ఇది సరైన అవకాశాన్ని కల్పిస్తుందన్నారు. ఐపీఎల్‌లో ఇప్పటికే కొన్ని జట్లకు కీలక ఆటగాళ్లు ఒక ఐడెంటిటీగా మారిపోయారన్నారు.

Details

చెన్నై సూపర్ కింగ్స్‌కి చిహ్నంగా ధోని

ఉదాహరణగా ఎంఎస్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్‌కి చిహ్నంగా మారాడని, సీనియర్ ఆటగాళ్లు ఎక్కువ కాలం ఆడటం టోర్నమెంట్‌కు చాలా మంచిదని చెప్పాడు. అయితే ఐదేళ్ల గడువు కాస్త ఎక్కువగా ఉందని, ఈ సమయంలో ఆటగాళ్లను అన్‌క్యాప్‌డ్‌గా పరిగణించడం కష్టంగా మారుతుందని కూడా టామ్ మూడీ అభిప్రాయపడ్డాడు. అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా పరిగణించడానికి ఐదేళ్లు చాలా ఎక్కువ అని తాను అనుకుంటున్నానని, మూడు సంవత్సరాల గడువు పెడితే మంచిదని ఆయన సూచించారు. మహేంద్ర సింగ్ ధోనీ విషయానికి వస్తే, ఇటీవల బీసీసీఐ రిటెన్షన్ నిబంధనలపై వచ్చిన మార్పుల తర్వాత ధోనీ తన భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు.

Details

భారత ఆటగాళ్లకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది

తాజా నిబంధనల ప్రకారం, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కేవలం రూ. 4 కోట్లకే ధోనీని రిటైన్ చేసుకోవచ్చు. ఇక బీసీసీఐ కొత్త నిబంధన ప్రకారం, ఏ భారత ఆటగాడు ఐపీఎల్ సీజన్‌కు ముందు ఐదేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ తుది జట్టులో ఆడకపోతే లేదా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో లేనట్లయితే, అతన్ని అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా పరిగణిస్తారు. ఈ నిబంధన భారత ఆటగాళ్లకు మాత్రమే వర్తిస్తుంది, ఇది జట్లకు తమ అన్‌క్యాప్‌డ్ ఆటగాళ్లను సులభంగా నిలుపుకునే మార్గంగా ఉపయోగపడుతుంది.