ఢిల్లీ క్యాపిటల్స్ కు ఊహించని షాక్.. మరో ప్లేయర్ దూరం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అశించిన మేర రాణించలేదు. ఈ సీజన్ లో వరుసగా ఐదు మ్యాచ్ లు ఓడిపోయి చెత్త రికార్డును మూట కట్టుకుంది. ఇటీవలే కోల్ కతా నైటర్స్ విజయం సాధించిన ఢిల్లీకి మరోషాక్ తగిలింది. ఆ జట్టు పాస్ట్ బౌలర్ కమలేస్ నాగర్ కోటీ వెన్ను గాయం నుంచి ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచేజీ స్పష్టం చేసింది. నాగర్ కోటిని గతేడాది వేలంలో కోటీ పది లక్షలకు ఢిల్లీ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే అతని స్థానంలో ఉత్తరప్రదేశ్ ఆటగాడు, అండర్-19 మాజీ కెప్టెన్ ప్రియమ్ గార్గ్ ను రిప్లేస్ మెంట్ గా ప్రకటించింది.
నాగర్ కోటి స్థానంలో ప్రియమ్ గార్గ్
ప్రియర్ గార్గ్ ని ఢిల్లీ క్యాపిటల్స్ రూ.20 లక్షల బేస్ ప్రైజ్ తో కొనుగోలు చేసింది. అతను 2020లో మొదటి సారిగా సన్ రైజర్స్ తరుపున ఆడాడు. అప్పట్లో అతన్ని సన్ రైజర్స్ రూ.1.90 కోట్లకు దక్కించుకుంది. ఐపీఎల్ లో 21 మ్యాచ్ లు ఆడిన గార్గ్ 17 ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేశాడు. ఇందులో 15.69 సగటుతో 251 పరుగులు చేశాడు. 2020లో 14 మ్యాచ్ లు ఆడిన ప్రియమ్ గార్గ్ కేవలం 133 పరుగులు చేశాడు. అయితే పృథ్వీ షా, యశ్ ధుల్; షఫాలీ వర్మా తర్వాత ఢిల్లీ తరుపున మరో అండర్ -19 కెప్టెన్ ఆడుతుండడం విశేషం.