Page Loader
4వేలు పరుగులు సాధించి.. ఖ్వాజా సంచలన రికార్డు
ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా

4వేలు పరుగులు సాధించి.. ఖ్వాజా సంచలన రికార్డు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 04, 2023
12:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా నూతన ఏడాదిని ఘనంగా ప్రారంభించాడు. టెస్టులో 4వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసి.. ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 10 పరుగులకే వెనుతిరిగాడు. ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నేతో జతకట్టి రెండో సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఖ్వాజా తన 56వ టెస్టులో 4,000 పరుగులు పూర్తి చేశాడు. ఈ మైలురాయిని పూర్తి చేసిన 27వ ఆసీస్ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

ఆస్ట్రేలియా

టెస్టులో 12 సెంచరీలు నమోదు

2011లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, టెస్టులో సగటు 45కి పైగా ఉండడం విశేషం. మొత్తం టెస్టు క్రికెట్ 12 సెంచరీలు చేశాడు. అత్యధిక స్కోరు 160 ముఖ్యంగా 2-0తో తిరుగులేని ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియా కీలక మ్యాచ్‌లో నిలవడం గమనార్హం. ఇక్కడ గెలిస్తే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో బెర్త్ ఖాయం అవుతుంది. ఒకవేళ ఓడిపోతే, ఆస్ట్రేలియాకు ఫిబ్రవరి-మార్చిలో భారత్‌తో జరిగే విదేశీ టెస్ట్ సిరీస్‌లో కనీసం ఒక విజయం, రెండు డ్రాలు చేయాల్సిన అవసరం ఉంటుంది.