
IND vs AUS: మూడో టెస్టులో అర్ధ సెంచరీతో చెలరేగిన ఉస్మాన్ ఖవాజ
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టు తొలిరోజు ఆటలో ఆస్ట్రేలియానే పైచేయి సాధించింది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 47 పరుగుల అధిక్యంలో నిలిచారు.
ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 60 పరుగులు చేసి తన కెరీర్‌లో 21వ అర్ధ సెంచరీని నమోదు చేశాడు. 12 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియాకు ఖవాజా-లాబుషెన్‌లు మంచి ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ కలిసి 96 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఖావాజా
టెస్టుల్లో 21 అర్ధసెంచరీలు సాధించిన ఖావాజా
ఖవాజా టెస్టులో 46.90 సగటుతో 4,315 పరుగులు చేశాడు. ఇందులో తన 21వ అర్ధ సెంచరీలు, 13 సెంచరీలున్నాయి. భారత్‌పై ఖవాజా 29.25 సగటుతో 351 పరుగులు సాధించాడు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకు ఆలౌటైంది. విరాట్ కోహ్లి జట్టులో అత్యధికంగా 22 పరుగులు చేశాడు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 21 పరుగులు, రోహిత్ శర్మ 12 పరుగులు చేశారు.
ఆస్ట్రేలియా తరపున మాథ్యూ కుహ్నెమన్ 5 వికెట్లు తీశాడు. నాథన్ లియోన్ 3, టాడ్ మర్ఫీలో ఒక వికెట్ పడగొట్టారు.