
PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025 సీజన్‌లో జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్లు పరుగుల వరద పాటించారు. టాస్ గెలిచిన పంజాబ్ మొదట బ్యాటింగ్‌కి దిగింది.
ఆరంభంలోనే ఇన్‌ఫామ్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (9) త్వరగా వెనుదిరిగినప్పటికీ, తర్వాతి బ్యాటర్లు భారీ స్కోరు ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు.
నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు నమోదు చేసింది.
నేహాల్ వధేరా 37 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 70 పరుగులు చేయగా, శశాంక్ సింగ్ 30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 59 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
Details
చివర్లో రాణించిన ఓమర్ జాయ్
శ్రేయస్ అయ్యర్ (30), ఓమర్ జాయ్ (21), ప్రభసిమ్రాన్ సింగ్ (21) కూడా మంచి డిస్కిప్లిన్‌తో బ్యాటింగ్ చేశారు.
ఒక్క మిచెల్ ఓవెన్ మాత్రమే పేలవంగా ఆడగా, మిగిలినవాళ్లంతా తమ వంతు పాత్రను చక్కగా పోషించారు.
రాజస్థాన్ బౌలింగ్ విభాగంలో తుషార్ దేశ్‌పాండే రెండు వికెట్లు తీసాడు.
మఫాక, రియాన్ పరాగ్, మధ్వాల్ తలా ఒక్కో వికెట్ తీసారు. చివరి వరకూ పంజాబ్ బ్యాటర్ల దూకుడుతో రాజస్థాన్ బౌలర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.