Loading...
IND-A vs UAE: వైభవ్ విధ్వంసం.. చిత్తు చిత్తుగా ఓడిన యూఏఈ
వైభవ్ విధ్వంసం.. చిత్తు చిత్తుగా ఓడిన యూఏఈ

IND-A vs UAE: వైభవ్ విధ్వంసం.. చిత్తు చిత్తుగా ఓడిన యూఏఈ

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 24, 2026
05:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 వన్డే టోర్నీలో ఇండియా A సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఏకంగా 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. 250 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 14.2 ఓవర్లలోనే ఛేదించింది. ఈ విజయానికి యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్ ప్రధాన కారణంగా నిలిచింది. అతడు 53 బంతుల్లోనే 204 పరుగులు చేసి యూఏఈ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు.

వివరాలు

28 సిక్సర్లు.. 7 ఫోర్లతో పరుగుల సునామీ

క్రీజులోకి వచ్చినప్పటి నుంచే వైభవ్ సూర్యవంశీ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. బౌండరీల వర్షం కురిపిస్తూ కేవలం 53 బంతుల్లో 204 పరుగులు సాధించాడు.

అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 28 సిక్సర్లు, ఏడు ఫోర్లు ఉన్నాయి.

ఈ విధ్వంసంతో ఇండియా A జట్టు లక్ష్యాన్ని అత్యంత వేగంగా ఛేదించి సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది.

వివరాలు

నాలుగు కీలక మైలురాళ్లు.. ప్రపంచ రికార్డులు

ఈ ఇన్నింగ్స్‌లో వైభవ్ సూర్యవంశీ వరుసగా వేగవంతమైన మైలురాళ్లను అందుకున్నాడు. కేవలం 16 బంతుల్లో అర్ధశతకం, 28 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.

ఆ తర్వాత కూడా అదే దూకుడును కొనసాగిస్తూ 40 బంతుల్లో 150 పరుగులు, 52 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు.

ఈ ప్రదర్శనతో లిస్ట్ A క్రికెట్‌లో అత్యంత వేగంగా సెంచరీ, 150 పరుగులు, డబుల్ సెంచరీ సాధించిన బ్యాటర్‌గా వైభవ్ రికార్డుల్లోకెక్కాడు.

అతడి అసాధారణ బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచం మరోసారి ఆశ్చర్యపోయింది.

ADVERTISEMENT