IPL 2026 Awards Winners List: 15 ఏళ్ల వయసులోనే చరిత్ర.. ఐపీఎల్ అవార్డులను ఊడ్చేసిన వైభవ్ సూర్యవంశీ
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 సీజన్‌కు తెరపడింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. కెప్టెన్ రజత్ పటిదార్ నాయకత్వంలో ఆర్సీబీ ఐపీఎల్ చరిత్రలో టైటిల్‌ను విజయవంతంగా కాపాడుకున్న మూడో జట్టుగా గుర్తింపు పొందింది. అయితే ఈ సీజన్ అవార్డుల కార్యక్రమంలో అందరి దృష్టిని ఆకర్షించిన పేరు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసులోనే రాజస్థాన్ రాయల్స్ తరఫున అద్భుత ప్రదర్శన కనబరిచిన అతడు ఐదు ప్రతిష్ఠాత్మక వ్యక్తిగత అవార్డులను సొంతం చేసుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
వివరాలు
తన
ఈ సీజన్‌లో 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్‌ను దక్కించుకున్న వైభవ్, అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా కూడా నిలిచాడు. అంతేకాకుండా మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ (MVP), ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, ఫాంటసీ కింగ్ ఆఫ్ ది సీజన్, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ అవార్డులను గెలుచుకున్నాడు. మొత్తం రూ.40 లక్షల ప్రైజ్ మనీతో పాటు సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ అవార్డు కింద టాటా సియెర్రా కారును కూడా అందుకున్నాడు.
వివరాలు
వచ్చే సీజన్లో మరింత మెరుగ్గా రాణిస్తా
అవార్డుల ప్రదానోత్సవం అనంతరం మాట్లాడిన వైభవ్ సూర్యవంశీ తన అనుభవాలను పంచుకున్నాడు. "ఇంత పెద్ద వేదికపై మాట్లాడటం కొంత ఒత్తిడిగా అనిపిస్తోంది. వచ్చే ఏడాది ఇంకా మెరుగైన ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తాను. మొదటి బంతినే బౌండరీకి పంపగలననే నమ్మకం ఉంటే ఎలాంటి సందేహం లేకుండా షాట్ ఆడతానని తెలిపాడు. ఈ సీజన్ తనకు ఎన్నో విలువైన పాఠాలు నేర్పిందని కూడా వైభవ్ పేర్కొన్నాడు. "ప్రతి బంతినీ బలంగా కొట్టడం సాధ్యం కాదని నేర్చుకున్నాను. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, మ్యాచ్ పరిస్థితులను ఎలా అర్థం చేసుకోవాలి, జట్టుకు అవసరమైన విధంగా ఎలా ఆడాలనే విషయాల్లో అనుభవం సంపాదించాను. ఇకపై ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి పెట్టి గాయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నానని చెప్పాడు.
వివరాలు
ఐపీఎల్ 2026 అవార్డుల పూర్తి జాబితా
ఆరెంజ్ క్యాప్: వైభవ్ సూర్యవంశీ - 776 పరుగులు పర్పుల్ క్యాప్: కగిసో రబడ - 29 వికెట్లు మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ (MVP): వైభవ్ సూర్యవంశీ - 436.5 MVP పాయింట్లు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్: వైభవ్ సూర్యవంశీ ఫాంటసీ కింగ్ ఆఫ్ ది సీజన్: వైభవ్ సూర్యవంశీ మోస్ట్ ఫోర్స్ ఆఫ్ ది సీజన్: సాయి సుదర్శన్ - 75 ఫోర్లు మోస్ట్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్: వైభవ్ సూర్యవంశీ - 72 సిక్సర్లు క్యాచ్ ఆఫ్ ది సీజన్: మనీష్ పాండే - ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్‌లో టిమ్ డేవిడ్‌ను ఔట్ చేసిన అద్భుత వన్-హ్యాండ్ క్యాచ్
వివరాలు
ఆ సంఘానికి రూ.50లక్షల బహుమతి
సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్: వైభవ్ సూర్యవంశీ (టాటా సియెర్రా కారు బహుమతి) మోస్ట్ డాట్ బాల్స్ అవార్డు: మహమ్మద్ సిరాజ్ - 172 డాట్ బాల్స్ ఫెయిర్ ప్లే అవార్డు: పంజాబ్ కింగ్స్ ఉత్తమ పిచ్ & గ్రౌండ్ అవార్డు: క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ఐపీఎల్ 2026లో అత్యుత్తమ పిచ్, గ్రౌండ్ నిర్వహణకు గాను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్‌కు ఈ అవార్డు దక్కింది. నాలుగు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహించినందుకు ఆ సంఘానికి రూ.50 లక్షల నగదు బహుమతి కూడా లభించింది. అలాగే తక్కువ మ్యాచ్‌లు నిర్వహించిన విభాగంలో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ గుర్తింపు పొందింది.