Vaibhav Suryavanshi: పది పరీక్షలకు దూరమైన వైభవ్ సూర్యవంశీ
ఈ వార్తాకథనం ఏంటి
భారత అండర్-19 ప్రపంచకప్‌లో మెరిసిన స్టార్ క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నాడు. రాబోయే టోర్నీలు, కఠినమైన క్రికెట్ శిక్షణపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైభవ్ పరీక్షలకు దూరంగా ఉండనున్న విషయాన్ని పాఠశాల యాజమాన్యం కూడా ధృవీకరించింది. ఈ నెల 17 నుంచి ప్రారంభమయ్యే పరీక్షల్లో అతడు పాల్గొనడంలేదని వెల్లడించింది.
Details
వచ్చే ఏడాది పరీక్షలకు హాజరు
ప్రస్తుతం అతడి పూర్తి దృష్టి క్రికెట్‌పైనే కేంద్రీకృతమైందని పేర్కొంది. వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ మాట్లాడుతూ ఇప్పుడంతా క్రికెట్‌కే ప్రాధాన్యం ఇస్తున్నాడు. అందుకే ఈసారి పదో తరగతి పరీక్షలు రాయకుండా వచ్చే ఏడాది పరీక్షలకు హాజరవుతాడని తెలిపారు. తండ్రితో చర్చించి, భవిష్యత్ ప్రణాళికలను దృష్టిలో ఉంచుకుని పరీక్షలకు దూరమవ్వాలని వైభవ్ నిర్ణయించుకున్నాడని తాజ్‌పూర్‌లోని మోడెస్టరీ స్కూల్ డైరెక్టర్ ఎ.కె. పింటూ స్పష్టం చేశారు.