LOADING...
Vaibhav Suryavanshi : రాజస్థాన్ రాయల్స్‌కు షాక్..గుడ్ బై చెప్పనున్న వైభవ్..రూ.30 కోట్ల డీల్ పక్కా?
రాజస్థాన్ రాయల్స్‌కు షాక్..గుడ్ బై చెప్పనున్న వైభవ్..రూ.30 కోట్ల డీల్ పక్కా?

Vaibhav Suryavanshi : రాజస్థాన్ రాయల్స్‌కు షాక్..గుడ్ బై చెప్పనున్న వైభవ్..రూ.30 కోట్ల డీల్ పక్కా?

వ్రాసిన వారు Moogati Shabari
Apr 30, 2026
10:05 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం ఒకే పేరును చర్చిస్తోంది .. అదే వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసులోనే జస్ప్రీత్ బుమ్రా, ప్యాట్ కమిన్స్ వంటి అగ్రశ్రేణి బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొంటూ అద్భుత ప్రదర్శన చేస్తున్న ఈ యువ ఆటగాడు ఐపీఎల్‌లో హాట్ టాపిక్‌గా మారాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో అతను ఒక విలువైన ఆస్తిగా మారగా, ఇప్పుడు ఇతర పెద్ద ఫ్రాంచైజీల దృష్టి కూడా అతనిపై పడుతోంది. ముఖ్యంగా ముంబయి ఇండియన్స్ వంటి శక్తివంతమైన జట్లు అతడిని తమ జట్టులోకి తీసుకోవడానికి ప్రయత్నించే అవకాశం ఉందని ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ అభిప్రాయపడ్డారు. రాజస్థాన్ రాయల్స్‌కు అతడిని నిలుపుకోవడం సులభం కాదని కూడా ఆయన హెచ్చరించారు.

వివరాలు

రూ.30 కోట్ల డీల్ నిజమేనా?

ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన స్టువర్ట్ బ్రాడ్, రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు. "13 లేదా 14 ఏళ్ల వయసున్న ఆటగాడిని ఐపీఎల్ వేలంలో రూ.1.1 కోట్లకు కొనుగోలు చేయడం అప్పట్లో ఆశ్చర్యంగా అనిపించింది. కానీ ఇప్పుడు అతను చూపిస్తున్న ప్రతిభ చూస్తే అది గొప్ప నిర్ణయం అని తెలుస్తోంది. అయితే, ఐపీఎల్‌లో ఏ ఆటగాడితోనూ దీర్ఘకాలిక (10 సంవత్సరాల) ఒప్పందాలు కుదుర్చుకోలేం. వైభవ్ మళ్లీ వేలంలోకి వస్తే అతడి ధర రూ.30 కోట్లకు మించి వెళ్లే అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్ వంటి జట్లు అతడిని సొంతం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాయి" అని బ్రాడ్ వ్యాఖ్యానించారు.

వివరాలు

బట్లర్ కామెంట్స్ వైరల్

వైభవ్ ఇప్పుడు కేవలం యువ ఆటగాడు మాత్రమే కాదు, ప్రేక్షకులను ఆకట్టుకునే స్టార్‌గా మారాడు. జస్ప్రీత్ బుమ్రా, ప్యాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొంటూ మొదటి బంతికే సిక్సర్లు కొట్టే ధైర్యం అతనిలో కనిపిస్తోంది. రాజస్థాన్ రాయల్స్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ కూడా అతని ఆటను ప్రశంసించాడు. "క్రిస్ గేల్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి ఆటగాళ్లు తమ కెరీర్‌లో నిర్భయంగా ఆడినట్లే, వైభవ్ కూడా చాలా చిన్న వయసులోనే అదే ధైర్యాన్ని చూపిస్తున్నాడు. అతను బ్యాటింగ్ చేస్తుంటే చూడాలనిపిస్తుంది" అని బట్లర్ అన్నాడు.

Advertisement

వివరాలు

ఖరీదైన ఆటగాడిగా నిలిచే అవకాశం..

రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ముంబై, చెన్నై, బెంగళూరు జట్లతో పోలిస్తే పెద్ద ఫ్యాన్ బేస్ ఎప్పుడూ ఉండేది కాదు. సంజూ శాంసన్ వంటి స్టార్ ఉన్నప్పటికీ, వైభవ్ రాకతో జట్టు ప్రజాదరణ గణనీయంగా పెరిగింది. రాబోయే వేలంలో వైభవ్ పాల్గొంటే, అతను ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. కేవలం రూ.1.1 కోట్ల పెట్టుబడితో రాజస్థాన్ ఇప్పుడు భారీ గుర్తింపును సంపాదించింది. అయితే ఇతర ఫ్రాంచైజీల నుంచి వచ్చే పెద్ద ఆఫర్లను ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement