
IPL 2025: 14 ఏళ్లలోనే ఐపీఎల్‌లో దుమ్మురేపిన వైభవ్.. అతని తర్వాత ఎవరున్నారంటే?
ఈ వార్తాకథనం ఏంటి
యువ క్రికెటర్లలో సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు.
అతి తక్కువ వయసులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అరంగేట్రం చేసిన ఆటగాడిగా తన పేరు రికార్డుల్లో నిలిపాడు.
వయస్సు కేవలం 14 ఏళ్ల 23 రోజులు ఉండగానే ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అతడు తొలిమ్యాచ్ ఆడాడు.
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34 పరుగులు చేసి మెరిశాడు.
బిహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ రూ.1.10 కోట్లకు దక్కించుకుంది.
Details
వేలంలో కూడా వైభవ్ రికార్డు
వేలంలో అమ్ముడైన అత్యంత పిన్న వయస్కుడిగా కూడా అతడు మరో రికార్డు నెలకొల్పాడు.
ఇంతకుముందు అతి పిన్న వయసులో ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఆటగాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన ప్రయాస్ రే బర్మన్ (16 ఏళ్ల 157 రోజులు).
అయితే లక్నో సూపర్ జెయింట్స్‌పై రాజస్థాన్ తరఫున వైభవ్ బరిలోకి దిగడంతో ఆ రికార్డు బద్దలైంది.
ఇప్పుడు అతి పిన్న వయసులో ఐపీఎల్ అరంగేట్రం చేసిన టాప్ 10ఆటగాళ్ల జాబితా ఇలా ఉంది
1.వైభవ్ సూర్యవంశీ- 14 ఏళ్ల 23 రోజులు-రాజస్థాన్ రాయల్స్, 2025
2.ప్రయాస్ రే బర్మన్- 16 ఏళ్ల 157 రోజులు-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 2019
3.ముజీబుర్ రెహ్మన్- 17 ఏళ్ల 11 రోజులు-పంజాబ్ కింగ్స్, 2018
Details
అతిచిన్న వయస్సులో అరంగేట్రం చేసిన ఆటగాళ్లు వీరే
4.రియాన్ పరాగ్ - 17 ఏళ్ల 152 రోజులు - రాజస్థాన్ రాయల్స్, 2019
5.ప్రదీప్ సాంగ్వాన్ - 17 ఏళ్ల 179 రోజులు - ఢిల్లీ డేర్‌డెవిల్స్, 2008
6.సర్ఫరాజ్ ఖాన్ - 17 ఏళ్ల 182 రోజులు - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 2015
7.వాషింగ్టన్ సుందర్ - 17 ఏళ్ల 199 రోజులు - రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్, 2017
8.రాహుల్ చాహర్ - 17 ఏళ్ల 247 రోజులు - రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్, 2017
9.అభిషేక్ శర్మ- 17 ఏళ్ల 250 రోజులు - ఢిల్లీ క్యాపిటల్స్, 2018
10.ఇషాన్ కిషన్- 17 ఏళ్ల 262 రోజులు - గుజరాత్ లయన్స్, 2017