తదుపరి వార్తా కథనం
Venkatesh Iyer: ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల జాబితాలోకి వెంకటేశ్ అయ్యర్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 24, 2024
08:10 pm
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా స్టార్ వెంకటేశ్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది.
ఈ స్టార్ ఆల్‌రౌండర్‌ను కోల్‌కతా రూ. 23.75 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది.
వెంకటేష్ అయ్యర్ కు ఇది తన ఐపీఎల్ కెరీర్ లోనే ఓ మైలురాయిగా చెప్పొచ్చు.
వెంకటేశ్ అయ్యర్ రూ. 2 కోట్ల కనిష్ఠ ధరతో వేలంలో పాల్గొన్నారు. అతని కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్లు పోటీ పడ్డాయి.
చివరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ అతన్ని అత్యధిక ధరకు కొనుగోలు చేసింది.
2024 సీజన్‌లో కోల్‌కతా జట్టు తరపున వెంకటేశ్ అయ్యర్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.