Page Loader
వెంకటేష్ అయ్యర్ మిస్టర్ 360 ఆటగాడు : కెవిన్ పీటర్సన్
వెంకటేష్ అయ్యర్ పై ప్రశంసలు కురిపించిన కెవిన్ పీటర్సన్

వెంకటేష్ అయ్యర్ మిస్టర్ 360 ఆటగాడు : కెవిన్ పీటర్సన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 17, 2023
04:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముంబై ఇండియన్స్ పై నిన్న అద్భుత సెంచరీతో చెలరేగిన కోల్ కతా ఆటగాడు వెంకటేష్ అయ్యర్‌పై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ముంబై చేతిలో కోల్ కతా ఓడిపోయిన అతడు ఆడిన ఇన్నింగ్స్ మాత్రం చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. మరోపక్క వెంకటేష్ అయ్యర్ బౌండరీల వర్షం కురిపించాడు. జట్టు స్కోరు 185 పరుగులు కాగా.. ఇందులో అయ్యర్ ఒక్కడే 104 పరుగులు చేయడం విశేషం. బ్రెండన్ మెక్ కల్లమ్ 2008లో చేసిన సెంచరీ తర్వాత కేకేఆర్ బ్యాటర్ గా వెంకటేష్ అయ్యర్ చరిత్రకెక్కాడు. అదే విధంగా అయ్యర్ పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ప్రశంసలు కురిపించాడు.

వెంకటేష్ అయ్యర్

అయ్యర్ స్పిన్ బౌలింగ్‌లో ధాటిగా ఆడడం అద్భుతం

అయ్యర్ 360 ప్లేయర్ తరహా ఆటగాడిని, చాలా ఎత్తుగా ఉండడం వల్లే బౌన్సర్లను చక్కగా ఎదుర్కొంటాడని, బ్యాక్ ఫుట్ మీద భారీ షాట్లు ఆడడం తనకెంతో నచ్చిందని, అదే విధంగా స్పిన్ బౌలింగ్ లో ధాటిగా ఆడడం అద్భుతమని కెవిన్ పీటర్సన్ చెప్పుకొచ్చాడు. దుబాయ్ లో అతడిని తొలిసారి చూసినప్పుడు ఇంప్రెస్ అయ్యానని, ఫుట్ షాట్లు, డ్రైవ్ షాట్లు ఆడే విధానం బాగుందని, స్టార్ ఆటగాడు అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని తెలియజేశాడు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే