కేఎల్ రాహుల్‌పై నాకు కోపం లేదు : మాజీ పేసర్
భారత్ క్రికెట్ జట్టుకు టెస్టులో వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఓపెనర్ కెఎల్ రాహుల్ టెస్టులో పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వరుసగా విఫలమవుతూ జట్టుకు భారంగా మారుతున్నాడు. నాగ్ పూర్ టెస్టులో 20 పరుగులు, ఢిల్లీ టెస్టులో 17 పరుగులకే ఔట్ అయి నిరాశపర్చాడు. దీంతో ఆతడిపై విమర్శులు వెలువెత్తుతున్నాయి. ముఖ్యంగా టీమిండియా మాజీ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ రాహుల్ పై వరుసగా విమర్శలు చేస్తూ ట్విట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. వీరిద్దరి మధ్య వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని సోషల్ మీడియా కోడై కూస్తోంది. రాహుల్ ను ఆడిస్తుండడంపై టీమిండియాలో క్రికెట్లు కొదవ ఉందా అని వెంకటేశ్ ప్రసాద్ ఘాటుగా విమర్శించారు.
వ్యక్తిగత విభేదాలు లేవు
తాజాగా రాహుల్‌పై విమర్శలు చేస్తున్న మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ స్పందించారు. తనకు రాహుల్ మధ్య వ్యక్తిగత విమర్శలు లేవని స్పష్టం చేశాడు. దీనిపై సోషల్ మీడియాలో మా ఇద్దరి మధ్య ఎదో ఉంది అని అనుకుంటున్నారని, వాస్తవానికి ఇది నిజం కాదన్నారు. రాహుల్ కు మంచి జరగాలని కోరుకుంటున్నాని , అయితే అతను టీమిండియాలో రాణించకపోవడంతోనే విమర్శలు చేశానని, భవిష్యత్ మరింత మెరుగ్గా రాణించాలని వెంకటేశ్ ప్రసాద్ స్పష్టం చేశారు. ధర్మశాలలో మార్చి 1 జరగాల్సిన మూడో టెస్టు ప్రస్తుతం ఇండోర్ లోని హోల్కర్ స్టేడియానికి మార్చారు. అయితే మూడో టెస్టులో రాహుల్ ఆడడం అనుమానంగా ఉంది.