
BCCI Digital Rights: వయాకామ్ 18 చేతికి బీసీసీఐ మీడియా హక్కులు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ మీడియా సంస్థ వయాకామ్ 18 ఇప్పటికే మహిళల ప్రీమియర్ లీగ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ మీడియా హక్కులను దక్కించుకున్న విషయం తెలిసిందే. తాజాగా బీసీసీఐ డిజిటల్, టీవీ హక్కులను సొంతం చేసుకుంది.
నేడు జరిగిన వేలంలో డిస్నీ స్టార్, సోనీ పిక్చర్స్, నెట్ వర్క్స్ ఇండియా వంటి ప్రధాన పోటీదారులను వెనక్కి నెట్టి, ముకేష్ అంబానీకి చెందిన వయాకామ్ 18 సంస్థ దక్కించుకుంది.
దీని కోసం బీసీసీఐకి వయాకామ్ 18 సంస్థ భారీగానే డబ్బులను అందజేసినట్లు తెలుస్తోంది.
భారత్ స్వదేశంలో ఆడే మ్యాచులు స్పోర్ట్స్ 18 ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం కానుండగా, జియో సినిమాలోనూ లైవ్ స్ట్రీమింగ్ కానున్నాయి.
Details
టీమిండియా ప్రతి మ్యాచుకు రూ.67.8 కోట్లు చెల్లించనున్న వయాకామ్ 18
టీమిండియా ఆడిన ప్రతి మ్యాచుకు రూ.67.8 కోట్లను చెల్లించనుంది. ఇప్పటి నుంచి ఐదేళ్ల పాటు వయాకామ్ 18 భారత జట్టు మ్యాచులను ప్రసారం చేస్తుంది.
ఈ ఐదేళ్లలో టీమిండియా 88 మ్యాచులను ఆడనుంది. ఇందులో 25 టెస్టులు, 27 వన్డేలు, 36 టీ20 మ్యాచులున్నాయి.
వయాకామ్ గతేడాది డబ్ల్యూపీఎల్ మీడియా హక్కులను సొంతం చేసుకుంది. దాని కోసం ఏకంగా రూ. 4 వేల కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది.