
PBKS vs RCB: పంజాబ్ పై గెలుపు.. ఐదో విజయాన్ని అందుకున్న బెంగళూర్
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 18వ సీజన్‌లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ తమ ఐదో విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. అనంతరం ఆర్సీబీ 18.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
బెంగళూరుకు ఆరంభంలో ఓపెనర్ ఫిల్ సాల్ట్ (1) త్వరగా ఔట్ అయినా, విరాట్ కోహ్లీ (73 నాటౌట్; 54 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), దేవ్‌దత్ పడిక్కల్ (61; 35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అద్భుతంగా ఆడారు.
Details
రాణించిన కోహ్లీ, ఫడిక్కల్
అర్ష్‌దీప్ సింగ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే సాల్ట్‌ను పెవిలియన్‌కి పంపాడు. అయితే కోహ్లీ-పడిక్కల్ జోడీ 103 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించి విజయం పునాదులు వేశారు.
పడిక్కల్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి, 61 పరుగులు చేసిన తర్వాత హర్‌ప్రీత్ చేతిలో వెనుదిరిగాడు.
ఆ తరువాత వచ్చిన రజత్ పటీదార్ (12)ను 17వ ఓవర్లో చాహల్ ఔట్ చేసినా, అప్పటికే బెంగళూరు విజయానికి దగ్గరగానే ఉంది.
చివర్లో కోహ్లీకి జితేశ్ శర్మ (11) మద్దతు ఇచ్చి మ్యాచ్‌ను ముగించారు. పంజాబ్ బ్యాటింగ్ వైఫల్యం కారణంగా భారీ స్కోరు చేయలేకపోయింది.
Details
విఫలమైన పంజాబ్ బ్యాటర్లు
ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (22; 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), సిమ్రన్ సింగ్ (33; 17 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి ఆరంభం అందించారు.
మిడిలార్డర్‌లో జోష్ ఇంగ్లిస్ (29), శశాంక్ సింగ్ (31 నాటౌట్), మార్కో యాన్సన్ (25 నాటౌట్) కొంతవరకూ న్యాయమే తీశారు.
అయితే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6) వరుసగా మూడో మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. నేహల్ వధేరా (5), స్టాయినిస్ (1) కూడా నిరాశపరిచారు.