Vinesh Phogat: వినేశ్ ఫొగాట్ పిటిషన్‌పై తీర్పు ఆగస్టు 16కు వాయిదా
పారిస్ ఒలింపిక్స్ 2024 తర్వాత, వినేష్ ఫోగట్ విషయంలో ఇంకా నిర్ణయం వెలువడలేదు. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS) మంగళవారం (ఆగస్టు 13) తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది, కానీ ఇప్పుడు అది వాయిదా పడింది. ఇప్పుడు కోర్టు తీర్పు ఆగస్టు 16న రానుంది. ఈ నిర్ణయం వినేష్‌కు అనుకూలంగా వస్తే రజత పతకం ఖాయం. పారిస్ ఒలింపిక్స్‌లో వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడటంతో క్రీడాభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
సెమీ ఫైనల్‌లో వినేష్‌ను ఓడించిన రెజ్లర్..ఫైనల్‌లో చోటు
ఫైనల్‌కు ముందు, పారిస్ ఒలింపిక్స్‌లో 50 కిలోల రెజ్లింగ్ విభాగంలో భారత క్రీడాకారిణి వినేష్ ఫోగట్ ఫైనల్‌కు చేరుకుంది. అయితే మ్యాచ్‌కు ముందు ఆమె బరువు చూసినప్పుడు 100 గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దీని తర్వాత ఆమెపై అనర్హత వేటు పడింది. సెమీ ఫైనల్‌లో వినేష్‌ను ఓడించిన రెజ్లర్..ఫైనల్‌లో చోటు దక్కించుకుంది. అయితే ఫైనల్‌లో ఓడిపోయింది. అమెరికా బంగారు పతకం సాధించింది. అనర్హత వేటు పడిన తర్వాత వినేష్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS)ని ఆశ్రయించింది.
వినేష్ కు మూడోసారి షాక్
వినేష్ పారిస్ ఒలింపిక్స్‌లోనే కాదు. నిజానికి ఇంతకుముందు కూడా రెండు సార్లు షాక్‌కు గురైంది. 2016 రియో గేమ్స్‌లో వినేష్ ఒలింపిక్ అరంగేట్రం చేసింది. 2016 రియో ఒలింపిక్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో మోకాలి గాయం కారణంగా ఆమె పతక ఆశలు ఆవిరయ్యాయి. దీని తరువాత, ఆమె 2020 లో టోక్యో ఒలింపిక్స్‌లో 53 కిలోల విభాగంలో క్వార్టర్ ఫైనల్‌లో ఓడిపోయింది. ఇప్పుడు 2024 లో ఆమె అధిక బరువు కారణంగా దూరంగా ఉంది.