LOADING...
Vinesh Phogat: రిటైర్‌మెంట్​పై వినేశ్‌ ఫొగాట్‌ యూటర్న్.. 2028 ఒలింపిక్సే టార్గెట్
2028 ఒలింపిక్సే టార్గెట్

Vinesh Phogat: రిటైర్‌మెంట్​పై వినేశ్‌ ఫొగాట్‌ యూటర్న్.. 2028 ఒలింపిక్సే టార్గెట్

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 12, 2025
01:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ శుక్రవారం కీలక నిర్ణయం వెల్లడించారు. కొంతకాలం క్రితం ప్రకటించిన తన రిటైర్మెంట్‌ను ఉపసంహరించుకుంటున్నానని, 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో పతకం సాధించాలనే లక్ష్యంతో మళ్లీ మ్యాచ్‌ల్లోకి అడుగుపెడతానని తెలిపారు. పారిస్ ఒలింపిక్స్‌లో నిర్దేశించిన బరువు కంటే 100 గ్రాములు అధికంగా రావడం వల్ల, అప్పట్లో 31 ఏళ్ల వయసులోనే వినేశ్‌ను ఫైనల్ బౌట్‌కి అర్హత లేని క్రీడాకారిణిగా ప్రకటించారు. ఫైనల్ ఆడే అవకాశం ఇవ్వలేదు, రన్నరప్ పతకాన్నీ అందించలేదు. ఈ షాక్‌తో ఆమె తీవ్ర నిరాశకు గురై, రెజ్లింగ్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే.

వివరాలు 

చాలాకాలం తర్వాత నేను స్పష్టంగా ఆలోచించే స్థితికి వచ్చాను

అయితే, ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్‌కు చేరుకున్న తొలి భారతీయ మహిళగా వినేశ్ చరిత్రలో నిలిచారు. అయినప్పటికీ, పారిస్‌లో ఆమె ఒలింపిక్ పతకం కల నెరవేరలేదు. దాదాపు 18 నెలల తర్వాత, ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగపూరితంగా ఒక సందేశం షేర్ చేస్తూ, తన రెజ్లింగ్ ప్రయాణాన్ని తిరిగి మొదలుపెట్టాలనే ఆలోచన చేస్తున్నట్లు స్పష్టం చేశారు. "పారిస్​ ఒలింపిక్స్​తో మీ కెరీర్ ముగిసిందా? అని చాలా మంది అడుగుతూనే ఉంటారు. చాలా కాలం ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాను. రెజ్లింగ్ మ్యాట్‌ నుంచి, ఒత్తిళ్ల నుంచి, అంచనాల నుంచి - ఇలాంటి ప్రతిదీ నుంచి నేను దూరంగా ఉండాల్సి వచ్చింది. చివరకు, చాలాకాలం తర్వాత నేను స్పష్టంగా ఆలోచించే స్థితికి వచ్చాను.

వివరాలు 

ఈ నిశ్శబ్దం నాకు గుర్తు చేసింది

నా దీర్ఘ ప్రయాణంలోని విజయాలు-పరాజయాలను, కఠిన అనుభవాలను అర్థం చేసుకోవడానికి కొంత విరామం తీసుకున్నాను. నా కెరీర్‌లో ఎన్ని శిఖరాలనో తాకాను,ఎన్ని హృదయవిదారకర ఘటనలు, ఎదుర్కొన్నానో నాకు తెలుసు. ఈ సంవత్సరాల తర్వాత ఒక నిజం మాత్రం స్పష్టమైంది.నేను ఇప్పటికీ రెజ్లింగ్‌ను ప్రేమిస్తూనే ఉన్నాను. పోటీ వాతావరణం ఇప్పటికీ నన్ను రగిలిస్తుంది. నాలోని జ్వాల ఇంకా ఆరిపోలేదని ఈ నిశ్శబ్దం నాకు గుర్తు చేసింది.క్రమశిక్షణ,రోజువారి శిక్షణ, పోరాటపు స్పూర్తి ..ఇవన్నీ నా స్వభావంలోనే భాగం.ఎంత దూరం వెళ్లినా,నా అంతరాత్మలో ఒక భాగం ఎల్లప్పుడూ రెజ్లింగ్ మ్యాట్‌పైనే ఉంటుంది. అందుకే, ఎలాంటి భయాలు లేకుండా, పరిస్థితులకి లొంగకుండా, 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్నాను." -వినేశ్ ఫొగాట్​, ఇండియన్ స్టార్​ రెజ్లర్, ఇన్​స్టా పోస్ట్

Advertisement

వివరాలు 

రాజకీయ జీవితం సంగతేంటి? 

వినేశ్ ఫొగాట్ గత సంవత్సరం హర్యానాలోని జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, సుమారు 6,000 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. దీంతో రాజకీయబాధ్యతలు,క్రీడాలక్ష్యాలను సమాంతరంగా కొనసాగించే అవకాశం ఆమెకు లభించింది. ప్రముఖ రెజ్లర్ సోమ్‌వీర్ రథీని వినేశ్ వివాహం చేసుకున్నారు.2025జూలైలో వారికి ఓ మగబిడ్డ జన్మించాడు. ఈనేపథ్యంలో,తల్లి అయిన తర్వాత మళ్లీ క్రీడా రంగంలోకి వస్తున్న భారతఅగ్రశ్రేణి అథ్లెట్ల జాబితాలో వినేశ్ కూడా చేరనున్నారు. తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తన కుమారుడి గురించి కూడా ఆమె ప్రస్తావించారు:"ఈసారి నేను ఒంటరిగా ప్రయాణం మొదలు పెట్టడం లేదు.నా కొడుకు కూడా నా జట్టులో భాగమవుతున్నాడు. అతడే నా బలమైన ప్రేరణ.లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో నా పెద్ద చీర్‌లీడర్ అతడే"అని ఆమె పేర్కొన్నారు.

Advertisement