Loading...
#viral Moment: ఆ స్టేడియం రికార్డులు గల్లంతు.. రెచ్చిపోయిన ప్రియాన్ష్ ఆర్య
ఆ స్టేడియం రికార్డులు గల్లంతు.. రెచ్చిపోయిన ప్రియాన్ష్ ఆర్య

#viral Moment: ఆ స్టేడియం రికార్డులు గల్లంతు.. రెచ్చిపోయిన ప్రియాన్ష్ ఆర్య

వ్రాసిన వారు Moogati Shabari
Apr 04, 2026
11:54 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం నుంచే రికార్డులు మోత మోగుతోంది. ఏప్రిల్ 3న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు అద్భుతమైన ప్రదర్శనతో మైదానాన్ని షేక్ చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్యాన్ని సవాలుగా తీసుకున్న పంజాబ్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య, కేవలం కొన్ని బంతుల్లోనే మ్యాచ్ దిశను పూర్తిగా మార్చాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ పేరుతో ఒక అరుదైన రికార్డును నమోదు చేసింది.

వివరాలు 

బౌలర్లను షేక్ చేశాడుగా..

మొదటి ఓవర్ నుంచే ఆర్య ఆకాశానికి తాకే షాట్లతో అలరించాడు.

మొదటి బంతికే ఫోర్ తో ఖాతాను ప్రారంభించి, రెండో బంతికే బౌండరీతో ఫైర్ చూపించాడు.

స్టేడియం మొత్తం బౌండరీల వర్షం కురిపించాడు. చెన్నై బౌలర్లకు షాకింగ్ ప్రదర్శన ఇచ్చాడు.

కేవలం 11 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు బాదుతూ 350 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 39 పరుగులు నమోదు చేశాడు.

హెన్రీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కావడంతో హాఫ్ సెంచరీ మిస్ అయినప్పటికీ, పంజాబ్ కోసం అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు.

వివరాలు 

రికార్డులు సాధించారిలా..

మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు కేవలం 3.2 ఓవర్ల (20 బంతుల)లో జట్టు స్కోరును 50కి చేర్చారు.

ఇది ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన టీమ్ ఫిఫ్టీగా రికార్డులలో నిలిచింది.

గతంలో 2011లో ముంబై ఇండియన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా 20 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసిన రికార్డు ఉంది.

పంజాబ్ ఈ రికార్డును సమం చేయడమే కాక, చెపాక్ స్టేడియంలో ఫాస్టెస్ట్ టీమ్ ఫిఫ్టీని కొట్టిన జట్టుగా చరిత్రలో నిలిచింది.

ప్రిభ్‌సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య జోడీ మొదటి వికెట్‌కు కేవలం 4 ఓవర్లలో 61 పరుగులు జోడించి జయానికి దారితీసింది.

ADVERTISEMENT

వివరాలు 

దూసుకెళ్లిన పంజాబ్..

చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ అయిన ఎంఏ చిదంబరం స్టేడియం సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని ప్రసిద్ధి చెందింది.

కానీ పంజాబ్ బ్యాటర్లు ఈ అంచనాలను పూర్తిగా మార్చేశారు.

ఆరు ఓవర్ల పవర్ ప్లే ముగిసే సమయానికి స్కోరు బోర్డు 80 పరుగుల మైలురాయిని దాటింది.

ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ శక్తి ఈ ఇన్నింగ్స్ ద్వారా స్పష్టంగా నిరూపితమైంది.

పటిష్టమైన CSK బౌలింగ్ విభాగంపై కూడా ఇంత వేగంగా పరుగులు సాధించడం పంజాబ్ ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని రెండింతలు చేసింది.

ADVERTISEMENT