LOADING...
#Viral Moment: వారెవ్వా..ఒంటిచేత్తో అద్భుతమైన క్యాచ్.. మార్కో జాన్సెన్ ఫీల్డింగ్ అదుర్స్
వారెవ్వా..ఒంటిచేత్తో అద్భుతమైన క్యాచ్.. మార్కో జాన్సెన్ ఫీల్డింగ్ అదుర్స్

#Viral Moment: వారెవ్వా..ఒంటిచేత్తో అద్భుతమైన క్యాచ్.. మార్కో జాన్సెన్ ఫీల్డింగ్ అదుర్స్

వ్రాసిన వారు Moogati Shabari
Apr 11, 2026
08:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేటి ఐపీఎల్ మ్యాచ్ 14వ ఓవర్‌లో ఈ విశేష ఘట్టం చోటు చేసుకుంది. అర్ష్‌దీప్ సింగ్ వేసిన డెలివరీని ఇషాన్ కిషన్ తన ప్రత్యేక శైలిలో ఫ్లిక్ చేస్తూ బౌండరీ దాటించేందుకు ప్రయత్నించాడు. ఆ షాట్ ఖచ్చితంగా సిక్సర్‌గా మారుతుందని అందరూ అనుకున్న సమయంలో, దాదాపు ఏడు అడుగుల ఎత్తు కలిగిన దక్షిణాఫ్రికా ఆటగాడు మార్కో జాన్సెన్ తన పొడవైన చేతులతో అడ్డుపడ్డాడు. డీప్ మిడ్‌వికెట్ ప్రాంతం నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి, అసాధ్యంగా కనిపించేలా గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో బంతిని పట్టుకున్నాడు. ఈ అద్భుత క్యాచ్‌ను చూసి బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాడు.

వివరాలు

దుమ్మురేపిన ఇన్నింగ్స్.. 28 బంతుల్లో 74 పరుగులు

ఇదిలా ఉండగా, టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అభిషేక్ శర్మ అదిరిపోయే స్టార్ట్ ఇచ్చాడు. కేవలం 28 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 భారీ సిక్సర్లతో 74 పరుగులు చేసి పంజాబ్ బౌలర్లపై ఒత్తిడి తెచ్చాడు. ఓపెనింగ్ భాగస్వామి ట్రావిస్ హెడ్‌తో కలిసి కేవలం 8 ఓవర్లలోనే జట్టు స్కోరును 120 పరుగులకు చేర్చాడు. అనంతరం హెడ్ (38), క్లాసెన్ (39) కీలక ఇన్నింగ్స్ ఆడడంతో హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.

వివరాలు

పరుగుల ప్రవాహం..

హైదరాబాద్ బ్యాటర్లు వేగంగా పరుగులు సాధిస్తున్న సమయంలో పార్ట్ టైమ్ బౌలర్ శశాంక్ సింగ్ పంజాబ్ జట్టుకు ఊరట ఇచ్చాడు. అతను 20 పరుగులు మాత్రమే ఇచ్చి అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వంటి ముఖ్యమైన వికెట్లను తీసి పరుగుల ప్రవాహాన్ని తగ్గించాడు. మరోవైపు అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు సాధించినప్పటికీ, తన నాలుగు ఓవర్లలో 50 పరుగులు ఇచ్చాడు. జాన్సెన్ క్యాచ్‌తో ఆకట్టుకున్నప్పటికీ, బౌలింగ్‌లో మాత్రం నాలుగు ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి వికెట్లు సాధించలేకపోయాడు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో: 

Advertisement